Prabhas - Chiranjeevi: ప్రభాస్ డైరెక్టర్ తో చిరంజీవి మెగా ప్రాజెక్ట్ ?
Prabhas - Chiranjeevi: చిరంజీవి.. ఏజ్ 70కు దగ్గర పడుతున్న సినిమాల విషయంలో ఎక్కడా తగ్గడం లేదు. అంతేకాదు యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్స్ తో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే ‘బింబిసార’తో దర్శకుడిగా పరిచయమైన వశిష్ఠతో ‘విశ్వంభర’ సినిమా చేస్తున్నారు. ఆ సినిమా తర్వాత ప్రభాస్ డైరెక్టర్ తో చిరంజీవి ఓ మెగా ప్రాజెక్ట్ ఓకే చేసినట్టు వార్తలు వస్తున్నాయి.
Prabhas - Chiranjeevi: చిరంజీవి గత సినిమా ‘భోళా శంకర్’ బొక్కా బోర్లా పడింది. దీంతో ఇకపై రీమేక్ సినిమాలు చేయకూడదనే నిర్ణయానికి వచ్చాడు. అందుకే మోహన్ లాల్ ‘బ్రో డాడీ’ మూవీ రీమేక్ చేయాలనే ఆలోచన విరమించుకున్నాడు. ఈ నేపథ్యంలో మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో ‘విశ్వంభర’ సినిమా చేస్తున్నారు. ఇప్పటికే రెండు పాటలు, ఓ ఫైట్ మినహా సినిమా మొత్తం పూర్తైయింది. ఈ సినిమా తర్వాత చిరంజీవి.. సందీప్ రెడ్డి వంగతో ఓ సినిమా చేయాలనే ప్లాన్ లో ఉన్నాడట. ఇప్పటికే సందీప్ రెడ్డి వంగా దగ్గర ఓ స్టోరీ రెడీ ఉందట.
ఇక సందీప్ రెడ్డి వంగా.. ప్రభాస్ తో చేయాల్సిన ‘స్పిరిట్’ మూవీ పట్టాలెక్కడానికి మరంత టైమ్ పట్టేలా ఉంది. ఈ లోపు చిరంజీవితో ఓ పవర్ ఫుల్ మాస్ సినిమా చేయడానికి రెడీ అవుతున్నారట సందీప్ రెడ్డి. ఇప్పటికే చిరుతో చేయాల్సిన సినిమాకు సంబంధించిన స్టోరీతో పాటు ఫుల్ స్క్రిప్ట్ రెడీ గా ఉందట. మరి నిజంగానే చిరంజీవి, సందీప్ రెడ్డి వంగా సినిమా పట్టాలెక్కితే మెగా ఫ్యాన్స్ కు అంతకు మించిన ఆనందం ఉండదు. ఈ ప్రాజెక్ట్ పై అఫీషియల్ ప్రకటన వెలుబడాల్సి ఉంది.
ఒకవేళ చిరంజీవి ఓకే చెబితే.. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేస్తాడట. ఇక సందీప్ రెడ్డి వంగా.. ప్రభాస్ తో చేయాల్సిన ‘స్పిరిట్’ మూవీ వచ్చే యేడాది ఏప్రిల్ లో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. అప్పటికే ప్రభాస్.. కల్కి పార్ట్ 2 తోపాటు .. ప్రశాంత్ నీల్ తో చేస్తోన్న ‘సలార్ పార్ట్ 2 శౌర్యంగ పర్వం’ కంప్లీట్ చేసి ఫ్రీ అవుతాడు. మరోవైపు హను రాఘవపూడితో చేయబోతున్న ‘ఫౌజీ’ సినిమాను ఈ యేడాది నవంబర్ లో స్టార్ట్ చేయనున్నాడు. ఈ సినిమా ఏప్రిల్ వరకు కంప్లీట్ అయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ప్రభాస్ .. అతిథి పాత్రలో నటించిన ‘కన్నప్ప’ ఈ యేడాది డిసెంబర్ లో విడుదల కానుంది. మరోవైపు ‘ది రాజా సాబ్’ మూవీ సంక్రాంతి కానుకగా విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.
ఇదీ చదవండి: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..
ఇదీ చదవండి: ‘కల్కి ’ సినిమాలో నాగ్ అశ్విన్ చేసిన ఈ బ్లండర్ మిస్టేక్ ను గుర్తించారా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook