‘సైరా’ సినిమా షూటింగ్ ముచ్చట్లు
మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం ‘సైరా’ ప్రస్తుతం హైదరాబాద్‌లోని కొండాపూర్ అల్యూమినియం ఫ్యాక్టరీలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.
మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం ‘సైరా’ ప్రస్తుతం హైదరాబాద్‌లోని కొండాపూర్ అల్యూమినియం ఫ్యాక్టరీలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. తొలిరోజు చిరంజీవి సెట్‌లోకి వచ్చాక అందరూ సెల్ఫీలతో సందడి చేశారు. హైదరాబాద్‌లో షూటింగ్ పూర్తయితే.. చిత్రంలో కొంతభాగాన్ని జైపూర్‌లో తెరకెక్కిస్తున్నట్లు వినికిడి. చిరంజీవి కోడలు ఉపాసన కామినేని తొలి రోజు షూటింగ్‌కు సంబంధించిన పలు ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ.. తన మామయ్యకు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పారు. దాదాపు 200 కోట్లతో భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, కిచ్చా సుదీప్, నయనతార, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్ షూటింగ్‌లో భాగంగా 1840 సంవత్సర కాలాన్ని తలపించే సెట్ వేశారు ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీకి చెందిన ఎఫ్‌బీ పేజీలో షూటింగ్ స్పాట్‌లో తీసిన ఒక వీడియోను కూడా పోస్టు చేశారు.
<