మెగాస్టార్ చిరంజీవి చిన్న అల్లుడు, శ్రీజ భర్త కళ్యాణ్ దేవ్‌ని మొట్టమొదటిసారి నటుడిగా పరిచయం చేస్తూ రూపొందిన విజేత సినిమా టీజర్ విడుదలైంది. ఈమధ్యే రిలీజైన ఫస్ట్ లుక్‌కి భారీ రెస్పాన్స్ కనిపించగా తాజాగా విడుదలైన టీజర్ సైతం కొంత ఆసక్తిని రేకెత్తిస్తోంది. తనకు ఉన్న పరిధిలో కొడుక్కి అడిగిందల్లా ఇచ్చి పెంచిన తండ్రి పాత్రలో ముర‌ళీ శ‌ర్మ నటించగా, ఉద్యోగం కోసం వెతుక్కుంటూ, ఇంకెంత కాలం ఇలా టైమ్ పాస్ చేస్తావు అని తండ్రి చేత మాటలుపడే పాత్రలో కళ్యాణ్ దేవ్ నటించినట్టు ఈ టీజర్‌ని చూస్తే అర్థమవుతోంది. రాకేశ్ శ‌శి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా ఇటీవలే టాకీ పార్ట్‌ను సైతం పూర్తిచేసుకుంది. జూన్ చివరి నాటికి మెగా హీరోల స్టైల్లోనే భారీ ఎత్తున ఆడియో ఫంక్షన్ నిర్వహించి, జూలైలో సినిమాని విడుదల చేసేందుకు 'విజేత' మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


కళ్యాణ్ దేవ్ సరసన 'ఎవడే సుబ్రహ్మణ్యం' ఫేమ్ మాళవికా నాయర్ జంటగా నటించింది. వారాహి చలన చిత్రం నిర్మిస్తున్న ఈ సినిమాకు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ కెమెరా హ్యాండిల్ చేస్తుండగా రంగస్థలం సినిమాలో బ్యాగ్రౌండ్ లొకేషన్స్‌కి తన సెట్స్‌తో ప్రాణం పోసిన రామకృష్ణ ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. మురళీ శర్మ, తనికెళ్ళభరణి, నాజర్, సత్యం రాజేష్, పోసాని కృష్ణమురళి, రాజీవ్ కనకాల, ప్రగతి, కళ్యాణి నటరాజన్, జయప్రకాష్ (తమిళ నటుడు), ఆదర్ష్ బాలకృష్ణ, నోయల్, కిరీటి, భద్రమ్ వంట నటీనటులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.