మెగాస్టార్ చిరంజీవి పేరిట ఒక రుచికరమైన ఫిల్టర్ కాఫీ తన అభిమానుల కోసం సిద్ధంగా ఉంది. అయితే హైదరాబాద్‌లోని ఓ కాఫీ షాపులో మాత్రమే ఇది దొరుకుతుంది. కానీ ఈ  కాఫీ షాపు చిరు అభిమానులెవరో ప్రారంభించారనుకుంటే పొరపాటే. స్వయాన చిరు కోడలు మరియు రామ్‌చరణ్ ఇల్లాలు ఉపాసన ‘అపోలో ఫౌండేషన్‌’  తరఫున ఈ కాఫీషాపును జూబ్లీహిల్స్‌లో ప్రారంభించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

‘కేఫ్‌’ పేరిట నెలకొల్పిన ఈ కాఫీ షాపులో పలు స్పెషల్ స్నాక్ ఐటమ్స్ ఉండేలా మెనూ తయారు చేశారు. హైదరాబాద్ కేసర్ రోజ్ టీ, లక్మీ చికెన్, వరల్డ్ ఫేమస్ సమోసా, మిర్చి బజ్జీతో పాటు "చిరు" ఫిల్టర్ కాఫీ కూడా ఈ షాపులో ప్రత్యేకం. ఇటీవలే ఈ కేఫ్ ప్రారంభానికి అందరినీ ఆహ్వానిస్తూ.. ఉపాసన తన ట్విటర్ పేజీలో పోస్టు చేశారు.  చిత్రమేంటంటే ఈ కేఫ్‌లో అన్ని ఐటమ్స్ కన్నా "చిరు" ఫిల్టర్ కాఫీ మాత్రమే డెడ్ చీప్ రేట్. ఇంతకీ ఈ కాఫీ ఖరీదు ఎంతనుకున్నారు.. జస్ట్ 20 రూపాయలేనట.