Chiyaan Vikram Corona: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచదేశాలన్నీ గడగడలాడుతున్నాయి. ఇప్పటికే అనేక దేశాల్లో విస్తరించిన కొత్త రకం మహమ్మారి.. ప్రజలతో పాటు పలు దేశాల ప్రభుత్వాన్ని భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ఒమిక్రాన్ వ్యాప్తి భయాల మధ్య భారతదేశంలోనూ కరోనా కేసులు హెచ్చు తగ్గులుగా నమోదవుతున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సారి సినీ ప్రముఖులందరూ కరోనా బారిన పడుతున్నారు. అంతకు ముందు కోలీవుడ్ లో కమల్ హాసన్ కొవిడ్ బారిన పడి.. రెండు వారాల తర్వాత కోలుకున్నారు. ఇప్పుడు తాజాగా మరో స్టార్ హీరో విక్రమ్ కరోనా బారిన పడ్డారు. గత రెండు రోజులుగా హై ఫీవర్ తో భాదపడుతున్న విక్రమ్ కోవిడ్ పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్ అని తేలింది.  అయితే.. ఇది ఒమిక్రాన్ వేరియంట్ అవునా ..? కాదా..? అని నిర్ధారించడానికి ప‌రీక్ష రిపోర్టుల‌ను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపినట్లు తెలుస్తోంది.


ప్రస్తుతం విక్రమ్ వైద్యుల పర్యవేక్షణలో తన నివాసంలోనే చికిత్స తీసుకొంటున్నారు. ఇటీవల కాలంలో తనతో పాటు తిరిగిన వారందరిని కూడా పరీక్షలు చేయించుకోవాల్సిందిగా ఆయన కోరారు. ప్రస్తుతం విక్రమ్ కుమారుడు ధ్రువ్​ విక్రమ్​తో కలిసి 'మహాన్', మణిరత్నం దర్శకత్వంలో 'పొన్నియన్ సెల్వన్' సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.  


Also Read: Esha Gupta: బాత్రూంలో చరణ్ హీరోయిన్ రచ్చ.. అక్కడ చేయి పెట్టుకుని మరీ (వీడియో)!


Also Read: Guess Who is She: ముద్దులొలికే ఈ చిన్నారి.. మలయాళంలో టాప్ హీరోయిన్ తెలుసా?


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook