Thangalaan Movie Release Date: చియాన్ విక్రమ్ హీరోగా నటిస్తున్న మూవీ తంగలాన్. ఈ చిత్రానికి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ పా రంజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. స్వాతంత్య్రానికి ముందు జరిగే పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ మూవీ తెరకెక్కుతోంది. కొలార్ గోల్డ్ ఫీల్డ్స్ (KGF)లో పని చేసే ఓ వర్గం కార్మికుల కోసం పోరాడే యోధుడి పాత్రలో విక్రమ్ నటించనున్నాడు. ఇది బ్రిటీష్ కాలం నాటి బ్యాక్‍డ్రాప్‍లో తెరకెక్కబోతుంది.  హాలీవుడ్ రేంజ్‍లో రూపొందుతున్న ఈ సినిమా కోసం విక్రమ్ తన మేకోవర్ ను పూర్తిగా మార్చేశాడు. పొడువు జట్టు, గడ్డం, రస్టిక్ లుక్‍తో విక్రమ్ గెటప్ చాలా డిఫరెంట్ గా ఉంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్ ఆడియెన్స్ లో విపరీతమైన క్యూరియాసిటీని పెంచేశాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా ఈ మూవీ నుంచి ఓ క్రేజీ అప్ డేట్ ను ఇచ్చారు మేకర్స్. ఈ మూవీ టీజర్ ను నవంబరు 01న రిలీజ్ చేయనుంది చిత్రయూనిట్. ఈ విషయాన్ని చియాన్ విక్రమ్ తన పుట్టినరోజు (అక్టోబర్ 27) సందర్భంగా ట్వీట్ చేశారు. తంగలాన్ మూవీని వచ్చే ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న విడుదల చేసే అవకాశం ఉందని విక్రమ్ పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఓ పోస్టర్ ను కూడా రిలీజ్ చేసింది మూవీ టీమ్. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా చిత్రీకరణలో విక్రమ్ గాయపడినా.. ఆ తర్వాత కోలుకున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది జనవరి 26న విడుదల కానుంది. ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది.


ఈ సినిమాలో పార్వతి తిరువోతు, మాళవిక మోహనన్, పశుపతి, హరికృష్ణన్, ప్రీతి కరణ్ కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించారు. నీలం ప్రొడక్షన్స్ పతాకంపై ఈ సినిమా నిర్మాణంలో దర్శకుడు రంజిత్ కూడా భాగమయ్యారు. ఈ మూవీకి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు. స్టన్నర్ స్యామ్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహారిస్తున్నారు. 



Also Read: Bigg Boss 7 Telugu: ఈ వారం హౌస్ నుంచి ఊహించని కంటెస్టెంట్ ఔట్.. ఆమెను కాపాడేందుకేనా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.