Choodu Nanna: 2019లో వచ్చి మంచి సక్సెస్ సాధించిన ‘యాత్ర’ సినిమాకి ప్రస్తుతం సీక్వెల్ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. మొదటి పార్ట్‌లో రాజశేఖర్‌ రెడ్డి పాత్రను లీడ్‌గా తీసుకొని చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు మహి వి రాఘవ్.. ఇప్పుడు యాత్ర2లో రాజశేఖర్‌ రెడ్డి మరణం, ఆ తర్వాత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఓదార్పు యాత్రను ఇతివృత్తంగా చేసుకొని సినిమాని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి మరో పాటని కూడా రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. చూడు నాన్న అనే టైటిల్ తో వచ్చిన ఈ సాంగ్ చాలా ఎమోషనల్ గా సాగింది. 


‘చూడు నాన్న.. చూస్తున్నావా నాన్న.. నీడలేని నేనా వీళ్ల ధీమా.. ఏమిటీ ఇంతటి ప్రేమా.. నాదారేటో తోచకుంటే నీవెంబడే మేము అంటూ కదిలారు ఏంటో ఆ నమ్మకం.. నేనెలా ఒడ్డుకు చేరడం వీళ్లనెలా ఒడ్డుకు చేర్చడం.. ఇంటిపెద్ద కన్నుమూస్తే అయినవాళ్లు అనాథలేగా నువ్వేలేక ఊరుఊరంతా అనాథలేగా’ అంటూ సాగిన ఈ సాంగ్ లిరిక్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఓదార్పు యాత్ర నేపథ్యంలో ఈ పాట ఉండనున్నట్లు ఈ సాంగ్ లో కనిపించే క్లిప్స్ చూసిన.. లిరిక్స్ విన్న స్పష్టమవుతోంది. ఈ పాటలో మధ్యలో కొన్ని ఎమోషనల్ డైలాగ్స్ కూడా పెట్టడంతో ఈ సాంగ్ మరింత ఎలివేట్ అయింది. ముఖ్యంగా ‘దేవుడు నమ్మకం, వైఎస్సార్‌ నిజం’ అనే డైలాగ్‌ ఆకట్టుకుంటోంది. ఇక ఈ పాటకు సంతోష్‌ నారాయణ్‌ సంగీతాన్ని అందించగా..భాస్కరభట్ల సాహిత్యం అందించారు.


 



కాగా ఈ సినిమాని ఫిబ్రవరి 8 2024లో విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు సినిమా యూనిట్. ఈ సినిమాలో మొదటి పార్ట్ లో వైయస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో కనిపించిన మమ్ముట్టి  పాత్ర అలానే కొనసాగగా..జగన్‌మోహన్‌ రెడ్డి పాత్రలో కోలీవుడ్‌ నటుడు జీవా నటిస్తున్నారు. ఈ పొలిటికల్ థ్రిల్లర్‌ చిత్రాన్ని త్రీ ఆటమ్‌ లీవ్స్, వీ సెల్యూలాయిడ్, శివ మేక సంయుక్తంగా నిర్మిస్తున్నారు.


Also Read Rythu Bandhu and Loan Waiver: తెలంగాణ రైతులకు శుభవార్త.. ఒకేసారి రైతుబంధు, రుణమాఫీ


Also Read Addanki Dayakar: అద్దంకి దయాకర్‌కు మరోసారి హ్యాండిచ్చిన కాంగ్రెస్.. అసలేం జరిగిందంటే..?


 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter