Chota K Naidu: సినిమాలు పక్కనపెట్టి ప్రస్తుతం రాజకీయాలతో పవన్‌ కల్యాణ్‌ ఫుల్‌బిజీగా ఉన్నారు. రాజకీయంగా ఆయన తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుండగా.. వ్యక్తిగతంగా మాత్రం సినీ రంగం వారు పవన్‌ను ఎంతో అభిమానిస్తున్నారు. ఈ క్రమంలో ఓ సినీ ప్రముఖుడు పవన్‌కల్యాణ్‌ వ్యక్తిత్వం గురించి మాట్లాడారు. పవన్‌ దయాగుణం ఎలాంటిదో వివరించాడు. ఆపదలో ఉంటే పవర్‌స్టార్‌ ఆగడని చెప్పారు. ఓ ఇంటర్య్వూలో పవన్‌కు సంబంధించిన ఒక మరచిపోలేని సంఘటనను పంచుకున్నారు. ఆయనే ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ చోటా కె నాయుడు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Annapurna Studios: అన్నపూర్ణ స్టూడియో అప్పుడు లక్షన్నర.. ఇప్పుడు ఎన్ని కోట్ల రూపాయలో తెలుసా?


 


ఆ ఇంటర్వ్యూలో పవన్‌ గురించి ప్రస్తావన రావడంతో చోటా కె నాయుడు ఒక సంఘటనను గుర్తు చేసుకున్నారు. 'తొలిప్రేమ' షూటింగ్‌ రోజులను నెమరువేసుకున్నారు. అప్పుడు పవన్‌ గొప్పతనం తెలిసిందని వివరించాడు. 'తొలిప్రేమ సినిమా సమయంలో ఒక క్రికెట్‌ సన్నివేశం తీస్తున్నాం. గచ్చిబౌలిలోని నానక్‌రామ్‌గూడలో ఒక పెద్ద క్వారీ ఉండేది. పవన్‌కల్యాణ్‌ రవిబాబుతో క్రికెట్‌ ఆడుతూ ఫైట్‌ చేయాల్సిన సీన్‌ ఉంది. వారిద్దరూ తెల్లటి చొక్కాలో ఉంటారు. ఓ సుమోలో వస్తుండగా నేను బయట ఎదురుచూస్తున్నా. నా కోసం ఆపి పదండి వెళ్దాం అని చెప్పడంతో అందరం కలిసి వెళ్తున్నాం. ఈ సమయంలో ఓ వ్యక్తి పవన్‌ను చూస్తూ స్కూటర్‌పై డ్రైవ్‌చేస్తూ వచ్చేశాడు. అనంతరం బైక్‌ ముందుకు వెళ్తూ వెనక్కి తిరిగిచూస్తూ అతడు వెళ్తున్నాడు. ఈ సమయంలో అతడిని ఓ కారు వచ్చి ఢీకొట్టింది'.

Also Read: Shiraz Vlogger: యూట్యూబ్‌ మెచ్చిన పాకిస్థాన్‌ బుడ్డోడి కిర్రాక్‌ వీడియోలు.. చూస్తే నవ్వకుండా ఉండలేరు


మరింత ఆసక్తిగా చోటా కె నాయుడు చెబుతూ... 'కారు ఢీకొట్టడంతో స్కూటర్‌పైనున్న వ్యక్తి ఎగిరి పడ్డాడు. ఆ సమయంలో మేమంతా అక్కడే ఉండగా పవన్‌ మాత్రం వెంటనే పరుగెత్తుకుంటూ వెళ్లాడు. గాయపడిన వ్యక్తిని స్వయంగా చేతులతో ఎత్తుకుని వెళ్లి తన సుమోలో ఎక్కించాడు. అనంతరం అతడిని ఆస్పత్రికి తరలించాడు. ఈ క్రమంలో పవన్‌కల్యాణ్‌ తెల్లా డ్రెస్‌ మొత్తం రక్తంతో నిండిపోయింది. ఆ సమయంలో షూటింగ్‌ ఉందనే విషయాన్ని కూడా పవన్‌ మరచిపోయారు. అంతలా పవన్‌కు మంచి మనసు ఉంది. సహాయం కోసం పవన్‌ పరితపిస్తాడు. ఎవరు ఏమిటీ అని తెలియకున్నా కష్టంలో ఉంటే వెంటనే సహాయం చేస్తాడు' అని చోటా కె నాయుడు తెలిపాడు. ఇంటర్వ్యూలో ఈ విషయం చెబుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు పవన్‌ గొప్పతనాన్ని ప్రశంసిస్తున్నారు. మనిషి పరంగా మంచి వ్యక్తే కానీ రాజకీయంగానే అంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాల్లోకి వచ్చి పవర్‌స్టార్‌ తన పరువును పోగొట్టుకుంటున్నారని కొందరు కామెంట్లు చేస్తున్నారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook