Clashes between Agent Director and Producer: మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా తర్వాత అఖిల్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఏజెంట్’. అఖిల్ కెరీర్ లోనే అత్యధిక భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకి సురేందర్ రెడ్డి డైరెక్టర్గా వ్యవహరించారు. మోస్ట్ స్టైలిష్ డైరెక్టర్గా పేరు ఉన్న సురేందర్ రెడ్డి ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిస్తున్నారు. కేవలం తెలుగు మాత్రమే కాదు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సైతం ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అలాగే అన్ని భాషల్లో ఒకే సమయంలో రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమా ఇప్పటికే అనేక సార్లు వాయిదా పడింది. ఇప్పుడు మరోసారి వాయిదా పడే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో దర్శకనిర్మాతల మధ్య దూరం పెరుగుతోందని ఇద్దరు మధ్య వివాదం కూడా చెలరేగింది అని ప్రచారం ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో జరుగుతోంది. అసలు విషయం ఏమిటంటే ఈ సినిమాని ఏప్రిల్ 28వ తేదీన విడుదల చేస్తామని చివరిగా దర్శక నిర్మాతలు ప్రకటించారు.


అలా ప్రకటించిన దాని మేరకు ఎలా అయినా ఆ రోజు కల్లా సినిమా పూర్తి చేసి విడుదల చేయాలని నిర్మాత భావిస్తుంటే డైరెక్టర్ సురేందర్ రెడ్డి మాత్రం తనకు ఇంకా సమయం కావాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి మధ్య చెలరేగిన వివాదం కారణంగా ఇప్పుడు సినిమా రిలీజ్ డేట్ విషయంలో సందిగ్ధత నెలకొంది. అక్కినేని అభిమానులు సహా తెలుగు ప్రేక్షకులు సైతం ఈ సినిమా ఎప్పుడు ఎప్పుడు చూస్తామా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


దానికి కారణం ఈ సినిమాలో అఖిల్ హీరోగా నటించడమే కాకుండా మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి కూడా ఒక కీలకపాత్రలో నటిస్తూ ఉండడమే. చివరి సారిగా ప్రకటించిన దాని మేరకు ఈ సినిమాని ఏప్రిల్ 28వ తేదీన రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ అప్పటికి సినిమా తన పూర్తి చేయలేనని దర్శకుడు సురేందర్ రెడ్డి తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది.


అయితే నిర్మాత మాత్రం అప్పటికి కచ్చితంగా పూర్తి చేసి ఇస్తే రిలీజ్ చేయాలని సురేందర్ రెడ్డి మీద ఒత్తిడి తీసుకొస్తున్నారట. ఈ విషయంలో ఏకాభిప్రాయానికి రాకపోవడంతో దర్శక నిర్మాతల మధ్య వివాదం ఎంత దూరం వెళుతుందో సినిమా మీద ఆ ప్రభావం ఏమైనా పడుతుందేమో అని అక్కినేని అభిమానులు టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాని ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద అనిల్ సుంకర భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. అఖిల్ ఒక రక్షణ శాఖకు చెందిన ఏజెంట్గా కనిపించబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.


Also Read: Shreya Dhanwanthary Photos: మొన్న ఏమీ లేకుండా.. ఇప్పుడు అదొక్కటే ధరించి హైదరాబాదీ బ్యూటీ రచ్చ!


Also Read: Samantha Saree Photo: ప్రియుడితో శకుంతల.. ప్రమోషన్స్ లో ఎక్కడా తగ్గని సమంత!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  TwitterFacebook