Comedian Prudhvi Raj Opens up on his Suicide Attempt: తెలుగులో కమెడియన్ పృథ్వీరాజ్ గురించి తెలియని వారందరూ 30 ఇయర్స్ పృథ్వీరాజ్ గా చాలా ఫేమస్ అయిన ఆయన తర్వాత సినిమాల నుంచి రాజకీయ రంగ ప్రవేశం కూడా చేశారు. ఒకరకంగా ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెంట ఆయన నడిచారు. 2014, 2019 ఎన్నికల్లో కూడా జగన్ కు మద్దతుగా వైసీపీకి మద్దతుగా అనేక చోట్ల ప్రచారం చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జగన్ కూడా తన గెలిచిన తర్వాత ఆయనకు ఒక కీలక పదవి కట్టబెట్టారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు లాంటి వ్యక్తి పని చేసిన ఎస్వీబీసీ ఛానల్ చైర్మన్ పదవి కట్టబెట్టారు జగన్. అయితే అనూహ్యంగా ఒక మహిళతో శృంగార భరితంగా మాట్లాడిన ఒక ఆడియో వైరల్ కావడంతో ఆ పదవి నుంచి ఆయన తప్పుకున్నారు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న పృథ్వీరాజ్ ఆ ఇంటర్వ్యూలో తాను సూసైడ్ చేసుకోబోయాను అంటూ జరుగుతున్న ప్రచారం మీద క్లారిటీ ఇచ్చారు.



మీ మీద ఒక న్యూస్ వచ్చింది మీరు సూసైడ్ అటెంప్ట్ చేశారు అని అది నిజమేనా అని పృథ్వీరాజ్ ని అడిగితే, ముందు నిజమేనని చెప్పిన ఆయన తనను కుటుంబ సభ్యులు కాపాడారని అన్నారు. తాను పడిపోయానని అయితే అది కావాలని పడలేదని చెప్పుకొచ్చారు. పెద్ద ఎత్తైన ప్రదేశం నుంచి ఏదో ఆలోచిస్తూ నడుస్తూ ఉండగా డిప్రెషన్ లో ఉండడం వల్ల ముందుకు పడిపోయానని అయితే ఆ కింద కొన్ని మెత్తటి వస్తువులు ఉండటం వల్ల ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాను కానీ కుడి చేతికి ఫ్రాక్చర్ అయిందని ఆ ఫ్రాక్చర్ వల్ల కూడా చాలా రోజులు పాటు ఇబ్బంది పడ్డానని చెప్పుకొచ్చారు.


అసలు ఈ జీవితం ఎప్పుడు అంతమవుతుందో తెలియదని ఎప్పుడైనా తాను బయటకు వెళ్ళినప్పుడు తనకు ఇప్పటికిప్పుడు ఏమైనా అయితే పెంచుకునే కుక్కలు ఏమైపోతాయా అని కూడా ఆలోచిస్తూ ఉంటాను అని చెప్పుకొచ్చారు. తాను కింద పడినప్పుడు తన కుటుంబ సభ్యులు తనకు అన్నీ అండగా ఉండి చూసుకున్నారని కోలుకోవడానికి చాలా సమయం పట్టిందని చెప్పుకొచ్చారు. నేను పైనుంచి కింద పడిపోతే అది సూసైడ్ అటెంప్ట్ అన్నారని వాస్తవానికి అది సూసైడ్ అటెంప్ట్ కాదని అన్నారు.


తాను చాలా స్థిరంగా ఉండే వ్యక్తిని, ఏదైనా అయితే భగవంతుడే మన ప్రాణాన్ని తీసుకువెళ్లాలి కానీ మనకి మనం ప్రాణం తీసుకునే హక్కు లేదని తాను నమ్ముతానని ఈ సందర్భంగా పృథ్వీరాజ్ చెప్పుకొచ్చారు. ఇక వైసీపీకి దూరమైన 30 ఇయర్స్ పృథ్వీరాజ్ ఇప్పుడు జనసేనకు దగ్గర అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. తద్వారా టిడిపికి కూడా ఆయన దగ్గర అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.


Also Read: Amala Paul Hot Photos: ఎద అందాలతో రచ్చ రేపిన అమలా పాల్..మరీ ఈ రేంజ్ లోనా?


Also Read: Nitin Manmohan: విషమంగా బాలీవుడ్ నిర్మాత ఆరోగ్యం..హుటాహుటిన హాస్పిటల్ కు స్టార్ హీరో!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook