Comedian Prudhvi Raj Reel ప్రస్తుతం సోషల్ మీడియాలో రీల్స్‌కు ఉన్న క్రేజ్ అందరికీ తెలిసిందే. సెలెబ్రిటీలే ఎక్కువగా రీల్స్‌కు అడిక్ట్ అవుతున్నారు. సెట్లో ఓ వైపు షూటింగ్ జరుగుతూ ఉంటే.. ఇంకో వైపు ఆర్టిస్టులు రీల్ వీడియోలంటూ బిజీగా ఉంటారు. ఇక బుల్లితెర తారలు అయితే ఎక్కువగా రీల్ వీడియోలతో హంగామా చేస్తుంటారు. తాజాగా జబర్దస్త్ తన్మయి, కమెడియన్ పృథ్వీ రాజ్‌లు చేసిన రీల్ వీడియో ఒకటి వైరల్ అవుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కమెడియన్ పృథ్వీ చుట్టూ ఎన్ని వివాదాలు, ఎంతటి కాంట్రవర్సీలు చుట్టు ముట్టాయో అందరికీ తెలిసిందే. ఆయన ఆడియో లీక్, వెనకాల నుంచి పట్టుకోవడం అనే డైలాగ్ ఎంతగా వైరల్ అయిందో తెలిసిందే. అదే డైలాగ్‌ను చివరకు సినిమాలోనూ పెట్టేసుకున్నాడు. రాజకీయంగా పృథ్వీ ఎన్ని ఎదురుదెబ్బలు తిన్నాడో అందరూ చూశారు. ఇప్పుడు వైఎస్సార్సీపీ నుంచి జనసేనలోకి వచ్చాడు పృథ్వీ.


బుల్లితెరపై షోలు, వెండితెరపై సినిమాలు, ఓటీటీలో వెబ్ సిరీస్‌లు చేసుకుంటూ బిజీగా ఉన్నాడు. ఈ మధ్యే ఏటీఎం అనే వెబ్ సిరిస్‌లో జగన్‌ మీద కౌంటర్లు వేసేసుకున్నాడు. తన కసిని కోపాన్ని తీర్చుకున్నాడు. ఇక ఇప్పుడు పృథ్వీ చేసిన రీల్ వీడియో వైరల్ అవుతోంది. పృథ్వీ ఎక్కువగా జబర్దస్త్ షో, శ్రీదేవీ డ్రామా కంపెనీ వంటి షోలకు వెళ్తుంటాడు.


 



జబర్దస్త్ ఆర్టిస్ట్ తన్మయితో పృథ్వీ చేసిన ఈ రీల్ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. మాస్టారు మాస్టారు అంటూ సాగే ఈ పాట ఇప్పుడు రీల్స్‌లో ట్రెండ్ అవుతోంది. ఆ పాటకు ఈ ఇద్దరూ కలిసి రొమాంటిక్‌గా స్టెప్పులు వేసే ప్రయత్నం చేశారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.


వైఎస్సార్సీపీలో ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్‌ను, జనసేనను ఎంత తిట్టినా కూడా మెగా ఫ్యామిలీ మాత్రం ఏమీ అనలేదని, తనకు అవకాశాలు రాకుండా ఏనాడూ అడ్డుకోలేదని, పైగా పిలిచి మరీ అవకాశాలు ఇచ్చారంటూ మెగా ఫ్యామిలీ గురించి పృథ్వీ ఎంతో గొప్పగా చెప్పిన సంగతి తెలిసిందే.
 


Also Read:  Anasuya Bharadwaj Photoshoot : పొద్దు తిరుగుడు పువ్వులా అనసూయ.. పూలతోటలో సోయగాల పరిమళం


Also Read: Prabhas Health : ప్రభాస్‌కు అనారోగ్యం.. షూటింగ్‌లు క్యాన్సిల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook