Raju Srivastava Health Update: ప్రముఖ కమెడియన్ రాజు శ్రీవాస్తవ ఆరోగ్యంపై ఆయన అభిమానులంతా ఆందోళన చెందుతున్నారు. ఆయనకు గుండెపోటు రావడంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేర్చారు కుటుంబసభ్యులు. అయితే రాజు శ్రీవాస్తవ ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇక ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాజు శ్రీవాస్తవ కుటుంబంతో మాట్లాడారని తెలుస్తోంది. యోగి ఆదిత్యనాథ్ రాజు శ్రీవాస్తవ భార్యతో ఫోన్‌లో మాట్లాడి ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ కష్ట సమయంలో రాజు శ్రీవాస్తవ కుటుంబానికి అన్ని విధాలుగా సహాయం చేస్తామని సీఎం యోగి హామీ ఇచ్చారని అంటున్నారు. అలాగే రాజు శ్రీవాస్తవ కుటుంబానికి అన్ని విధాలా సాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వ అధికారులందరినీ సీఎం యోగి ఆదేశించారని అంటున్నారు. రాజు శ్రీవాస్తవ స్పెషలిస్ట్ లు అయిన వైద్యుల కట్టుదిట్టమైన పర్యవేక్షణలో ఉన్నారు. AIIMS లో వెంటిలేటర్ సపోర్ట్ మీద ఆయనని ఉంచారు. ఇక పరిస్థితి విషమంగా మారడంతో ముందుగా ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగంలో వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు.


తర్వాత సీసీయూ (కార్డియాక్ కేర్ యూనిట్)కి ఆయనని మార్చారు. ఆసుపత్రి వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం, రాజు శ్రీవాస్తవకి యాంజియోగ్రఫీ జరిగింది, ఇందులో 100 శాతం బ్లాక్ అయినట్టు గుర్తించారని, ప్రస్తుతం రాజు పరిస్థితి విషమంగా ఉందని, అందుకే వెంటిలేటర్ సపోర్టుపై ఉంచామని వైద్యులు తెలిపారు.  ఇక హోటల్ జిమ్‌లో వ్యాయామం చేస్తున్న రాజు శ్రీవాస్తవ ట్రెడ్‌మిల్‌పై ఉండగా ఛాతీలో నొప్పి వచ్చి కింద పడిపోయాడు. ఇక ఆ తర్వాత, రాజు శ్రీవాస్తవను అతని జిమ్ ట్రైనర్ వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఇక హాస్యనటుడు సునీల్ పాల్ తన స్నేహితుడు శ్రీవాస్తవ ఆరోగ్యం మెరుగుపడుతున్నట్లు చెప్పారు.


పాల్ సోషల్ మీడియాతో పంచుకున్న వీడియోలో, 'అతను ఇప్పుడు బాగానే ఉన్నాడు, ప్రమాదం నుండి బయటపడ్డాడని పేర్కొన్నారు. ఇక ప్రస్తుతం శ్రీవాస్తవ ఉత్తరప్రదేశ్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఉన్నారు. అయితే రాజు శ్రీవాస్తవ మాత్రమే కాదు, అతని తమ్ముడు కూడా ఢిల్లీ ఎయిమ్స్‌లో అడ్మిట్ అయ్యాడని చెబుతున్నారు. రాజు శ్రీవాస్తవ తమ్ముడు గత నాలుగు రోజుల నుంచి ఆసుపత్రిలోని న్యూరో విభాగంలోని ఐసియులో ఉన్నారని అంటున్నారు. రాజు శ్రీవాస్తవ రెండవ అంతస్తులో, అతని సోదరుడు మూడవ అంతస్తులో చికిత్స పొందుతున్నారు. రాజు శ్రీవాస్తవ నోయిడాలో ఫిల్మ్ సిటీని ఏర్పాటు చేయడంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తరపున ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు.
Also Read: Laal Singh Chaddha Review: నాగచైతన్య బాలీవుడ్ ఎంట్రీ మూవీ ‘లాల్ సింగ్ చడ్డా’ ఎలా ఉందో తెలుసా?


Also Read: Actor Vishal: మరోసారి హీరో విశాల్ కు ప్రమాదం.. షూటింగ్లో తీవ్ర గాయాలు!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.