యాక్టర్స్: సదన్, దీపికా రెడ్డి, రేఖ నిరోష 
కెమెరా: ఎంవీ గోపి
ఎడిటర్‌: మార్తండ్‌ కె.వెంకటేశ్‌
సంగీతం: సుక్కు
నేపథ్య సంగీతం: సాహిత్య సాగర్‌
నిర్మాత: బీవీ రెడ్డి
డైరెక్టర్: శేఖర్‌ ముత్యాల
విడుదల తేదీ: జూన్ 23


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Bhari Taraganam Movie Review and Rating: నూతన నటీనటులతో శేఖర్ ముత్యాల డైరెక్షన్‌లో తెరకెక్కిన మూవీ భారీ తారాగణం. లవ్‌, కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించిన ఈ సినిమాను బీవీఆర్ పిక్చర్స్ బ్యానర్‌పై బీవీ రెడ్డి నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. నేడు (శుక్రవారం) గ్రాండ్‌గా థియేటర్స్‌ ముందుకు వచ్చింది. టైటిల్‌తోనే ఆసక్తిని క్రియేట్ చేసిన భారీ తారాగణం ఎలా ఉందో చూద్దాం..


కథ ఏంటంటే..?


ఐదుగురు అమ్మాయిలు ఒక కూతురు, ఒక భార్య, ఒక ప్రేమికురాలు, ఒక పీఏ, ఒక స్నేహితురాలు తమ జీవితాలలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు..? ఆ సమస్యలను వారు ఎలా బయటపడ్డారు..? మనం ఒకరికి సాయం చేస్తే.. తిరిగి మనకు సాయం అందుతుందనేది స్టోరీ. కథలోకి వెళితే.. విశ్వనాథ్‌ (కేదార్ శంకర్), రఘు (తోటమల్లి  మధు) ఇద్దరు ఫ్రెండ్స్. విశ్వనాథ్‌ కొడుకు సదన్ (హీరో), రఘు కూతురు ధనలక్ష్మి (రేఖ నిరోషా)లు చిన్నప్పటి నుంచి ఒకే స్కూల్‌లో చదువుతుంటారు. ఇద్దరు ఎంతో ఆప్యాయంగా ఉంటారు. దీంతో వీరిద్దరినీ చూసి  పెద్దయిన తరువాత ఇద్దరికీ  పెళ్లి చేయాలని విశ్వనాథ్‌, రఘు అనుకుంటారు. పై చదువుల కోసం సదన్ పట్నం వచ్చి ఇంజినీరింగ్‌లో చేరుతాడు. 


అదే కాలేజీలో చదువుతున్న తార  (దీపికా రెడ్డి)ని చూసి తొలి చూపులోనే ప్రేమించేస్తాడు. ఆమె ఎదుటివారికి సాయం చేసే తీరు సదన్‌కు ఎంతో నచ్చుతుంది. అదేవిధంగా సదన్ కూడా కాలేజీలో చేసే పనులతో తారను మెప్పిస్తాడు. అయితే తారకు అనుకొని సంఘటనలు ఎదురవుతాయి. దీంతో సదన్‌ను దూరం పెట్టాల్సి వస్తుంది. తన ప్రేమను తార రిజెక్ట్ చేసిందని బాధతో సదన్ తిరిగి తన గ్రామానికి వచ్చేస్తాడు. ఇక అమ్మాయిలు అందరూ అంతే అనే భావనతో ఉంటాడు. మరోవైపు రఘు కూతురు ధనలక్షికి ఎన్ని సంబంధాలు చూసినా.. తాను పెళ్లి చేసుకోనని రిజెక్ట్ చేస్తుంటుంది. చిన్ననాటి స్నేహితుడు సదన్‌ను కూడా వివాహం చేసుకోనని చెబుతుంది.


చిట్టెమ్మ డాబా నడుపుతున్న చిట్టెమ్మ (సరయు) కూడా ఎన్నో కష్టాలు పడుతుంటుంది. తార, చిట్టెమ్మ, ధనలక్ష్మి, శాంతి (సాహితీ దాసరి), పరిమళ (స్మైలీ) ఇలా ఐదుగురు తమ వారి జీవితాలలో  వేర్వేరు సందర్భాల్లో తాము ఎదుర్కొన్న సమస్యల నుంచి ఎలా బయటపడ్డారు.. ? అనుకోని విధంగా  సదన్ వీరికి ఎలా సాయం చేశాడు..? సదన్‌కు ఈ ఐదుగురితో ఉన్న సంబంధం ఏంటి..? అనేది తెలుసుకోవాలంటే కచ్చితంగా భారీ తారాగణం మూవీని చూడాల్సిందే..


ఎవరు ఎలా నటించారంటే..?


హీరో సదన్ క్యారెక్టర్‌లో అలీ అన్న కొడుకు సదన్‌ నటించాడు. తనకు ఇదే మొదటి సినిమా అయినా.. తన నటనతో మెప్పించాడు. ఎక్కడ తన మొదటి సినిమా అనే భావన లేకుండా హావ భావాలు పలికించాడు. అన్ని షేడ్స్‌లో చాలా చక్కగా నటించాడు. హీరోయిన్ దీపికా రెడ్డి తన గ్లామర్‌తో ఆకట్టుకుంది. మరో హీరోయిన్ ధనలక్ష్మిగా నటించిన రేఖ నిరోషా నటనతో మెప్పించింది. చిట్టెమ్మ పాత్రలో సరయు, డాక్టర్‌కు పీఏ పాత్రలో (స్మైలీ)లు తమ పాత్రలలో మంచి మార్కులే కొట్టేశారు. సైకాలాజీ  డాక్టర్‌గా  శశిధర్ పాత్రలో సమీర్ మెరిశాడు. హీరోకు ఫ్రెండ్స్‌గా సన్నీ, సత్యలు కామెడీని బాగానే పండించారు. అలీ కూడా ఒక పాటలో  మెరిశాడు. రాజకీయ నాయకుడిగా పోసాని పాత్ర చిన్నదే అయినా.. కథ పరంగా ముఖ్యమైనదే. 


మహిళలు తమ జీవితాల్లో ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారు..? ఆ సమస్యల నుంచి వారు ఎలా బయట పడాలి..? అనే కాన్సెప్ట్‌ను తీసుకుని.. లవ్, కామెడీ, థ్రిల్లర్‌ను జోడించాడు డైరెక్టర్ శేఖర్ ముత్యాల. డైలాగ్స్‌ను కొత్త రకంగా చెప్పిస్తూ.. స్క్రీన్ ప్లేను చక్కగా ప్రెజెంట్ చేశాడు. కథలో ట్విస్టులతో ఆడియన్స్‌ను థియేటర్లో కూర్చునేలా  బాగా ఎంగేజ్ చేశాడానే చెప్పొచ్చు. పేపర్ మీద రాసుకున్న ప్రతి పాత్రను తెరపై తాను అనుకున్న విధంగానే చూపించి సక్సెస్ అయ్యాడు. మ్యూజిక్ డైరెక్టర్ సుక్కు సంగీతం ఆకట్టుకుంటుంది. సాహిత్య సాగర్ అందించిన నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. ఖర్చుకు ఎక్కడా వెనక్కితగ్గకుండా నిర్మాణ విలువలు చక్కగా ఉన్నాయి. ప్రేమ, కామెడీ, థ్రిల్లర్ మూవీని ఇష్టపడే ప్రేక్షకులకు భారీ తారాగణం మూవీ తప్పకుండా నచ్చుతుంది. 


ప్లస్ పాయింట్స్ 


+ కథనం


+ రీ రికార్డింగ్


+ నిర్మాణ విలువలు


మైనస్ పాయింట్స్ 


- రొటిన్ స్టోరీ


- మధ్య మధ్యలో బోర్ కొట్టే సీన్స్


- ఎడిటింగ్


రేటింగ్: 2.75/5