Investigations ordered against BookMyShow : ఒకప్పుడు సినిమా టికెట్ కొనాలంటే క్యూలో నిలబడాల్సిందే. అలాంటిది ఇప్పుడు అంత కష్టం లేకుండా చాలా సులభంగా ఇంట్లో కుర్చుని బుక్ మై షో వంటి యాప్స్ ద్వారా మనం బుక్ చేసేస్తున్నాం. అంటే చాలా వరకు విలువైన సమయాన్ని అలాంటి యాప్స్ ఆదా చేస్తున్నాయి. అయితే టికెట్లు బుక్ చేసినందుకు గాను సర్వీస్ ఛార్జీలు సహా ఇంటర్నెట్ హ్యాండ్లింగ్ ఫీజు అంటూ పెద్ద ఎత్తున దోచేస్తున్నా పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు సదరు సంస్థ చేస్తున్న ఒక దందాను బయట పెట్టారు. ఈ వ్యవహారంలో పలు కీలక అంశాలు బయటకు వచ్చాయి.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలంగాణకు చెందిన విజయ్‌గోపాల్‌ అనే సామాజిక కార్యకర్త ‘షో టైమ్‌’ అనే ఆన్‌లైన్‌ మూవీ టికెటింగ్‌ పోర్టల్‌ ను స్థాపించారు. ఆన్‌లైన్‌ మూవీ టికెటింగ్‌లో 90 % వాటాకు పైగా కలిగి ఉన్న ‘బుక్‌ మై షో’ వంటివాటికి పోటీగా ఆయన ఒక సొంత పోర్టల్ ఏర్పాటు చేసి తన పోర్టల్‌ ద్వారా టికెట్లు విక్రయించేందుకు పలు మల్టీప్లెక్స్‌లు,  సింగిల్‌ స్క్రీన్ థియేటర్లను సంప్రదించారు. ఈ సమయంలోనే ఆయా యాజామాన్యాలతో ‘బుక్‌ మై షో’ అగ్రిమెంట్లు చేసుకుందని,  సున్నా వడ్డీకే రుణాలు,  మానిటరీ డిపాజిట్లతో ఆకట్టుకుని టికెట్లన్నీ తమ యాప్‌ ద్వారానే విక్రయించేలా ఏర్పాట్లు చేసుకున్నట్టు గుర్తించాడు. దీంతో ఆయన కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియాకి ఫిర్యాదు చేశారు. 


అంతేకాదు బుక్‌ మై షో ప్రతి టికెట్‌పై కన్వీనియెన్స్‌ ఫీజు పేరుతొ ప్రేక్షకుల నుంచి రూ.25 వసూలు చేస్తూ అందులో సగానికి పైగా మల్టీప్లెక్స్‌ థియేటర్లకు,  పావు వంతు దాకా సింగిల్‌ థియేటర్లకు కమీషన్‌గా ఇస్తోందని పేర్కొన్నారు. అలా వసూలు చేస్తున్న ఈ కన్వీనియెన్స్‌ ఫీజు వల్ల ప్రేక్షకులపై అదనపు భారం పడుతోందని అంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. తాను స్థాపించిన ‘షో టైమ్‌’ ద్వారా ప్రేక్షకుల నుంచి కన్వీనియెన్స్‌ ఫీజు 11 రూపాయలు మాత్రమే వసూలు చేస్తానని,  చెబుతూ తనకు టికెట్లు కేటాయించాల్సిందిగా థియేటర్లను సంప్రదించగా,  తమకు బుక్‌ మై షోతో ఒప్పందాలున్నాయని తేలిందని ఫిర్యాదులో ప్రస్తావించాడు.


ఆ యాప్ తప్ప వేరే విధంగా టికెట్లు విక్రయించకుండా రెండేళ్ల నుంచి ఐదేళ్ల దాకా ‘రెఫ్యూజల్‌ టు డీల్‌’ అగ్రిమెంట్లు కుదుర్చుకున్నాయని చెప్పినట్టు ఆయన పేర్కొన్నారు. అలా 100 శాతం టికెట్లూ తన ప్లాట్‌ఫామ్‌పైనే విక్రయించేలా బుక్‌ మై షో ఒప్పందం కుదుర్చుకున్న క్రమంలో అది కాంపిటీషన్‌ యాక్ట్‌కు విరుద్ధమని విజయ్ గోపాల్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయం మీద బుక్ మై షో సీసీఐకి సమాధానం సమర్పించినా కాంపిటీషన్ యాక్ట్ కింద దర్యాప్తు జరపాల్సిందిగా కోరింది. ఇక మరోపక్క ఏపీలో సినిమా టికెట్ల విక్రయాలు ప్రభుత్వ నిర్వహణలో,  ఏపీఎఫ్డీసీ ఆధ్వర్యంలో  జరపాలనే  నిర్ణయంపై బుక్‌ మై  షో యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది. అయితే ప్రభుత్వ ప్రక్రియ ప్రారంభం కావడంతో మధ్యంతర ఉత్తర్వులు సాధ్యం కాదని కోర్టు పేర్కొంది.


Also Read: Tollywood Producer: కాకా పట్టు సినిమా పట్టు.. ఆఖరికి కుక్క బిస్కెట్లు కూడానా?


Also Read: Tollywood Stars to OTT : డిజిటల్లోకి దూసుకుపోతున్న స్టార్లు ఎవరెవరంటే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook