Complaint Registered on Commitment Movie Trailer: ఇటీవల పలు సినిమాలు కావాలనే వివాదాలను కొని తెచ్చుకుంటున్నాయో లేక అవి అనుకోకుండా వివాదాల్లో చిక్కుకుంటున్నాయో తెలియదు కానీ అణుహంగా వార్తల్లోకి ఎక్కుతున్నాయి. ఇప్పుడు తెలుగులో కమిట్మెంట్ అనే సినిమా కూడా వివాదంలో చిక్కుకుంది. తాజాగా కమిట్మెంట్ సినిమా ట్రైలర్ పై కేతెలంగాణాలో సు నమోదయింది. తెలంగాణ రాజధాని హైదరాబాద్ సీసీఎస్ లో  67 ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ లో భగవత్ గీత శ్లోకాన్ని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కింద సినిమా యూనిట్ వాడింది. ఇక ఈ అంశం మీద అభ్యంతరం వ్యక్తం చేస్తూ సీసీఎస్ లో సినీ నటి కరాటే కల్యాణి ఫిర్యాదు చేశారు. హిందువుల మనోభావాలు కించ పరిచే విధంగా ట్రైలర్ ఉందంటూ ఫిర్యాదులో కళ్యాణి పేర్కొన్నారు. బూతు సన్నివేశాలకు భగవద్గీత శ్లోకం ఎలా వాడతారు అంటూ కరాటే కళ్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఒకవేళ ఈ ట్రైలర్ ను కనుక డిలీట్ చేయకుంటే చిత్ర యూనిట్ ఆఫీస్ ధ్వంసం చేస్తామంటూ హిందూ సంఘాలు హెచ్చరికలు జరీ చేస్తున్నాయి. అయితే ఈ క్రమంలో వివాదం పెద్దది కాకూడదు అని భావిస్తూ కమిట్మెంట్ సినిమా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ హిందూ సంఘాలతో టచ్ లోకి వచ్చినట్టు సమాచారం. అసలు తమ సినిమా ట్రైలర్ లో అలాంటి మ్యూజిక్ వాడనే లేదు అంటూ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కవర్ చేసుకునే ప్రయత్నం చేసినట్టు చెబుతున్నారు.


హైదరాబాద్ నవాబ్స్,  నిన్న నేడు రేపు,  పరిచయం లాంటి సినిమాలు తెరకెక్కించిన లక్ష్మీకాంత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. తేజస్వీ మడివాడ,  అమిత్ తివారీ,  రమ్య పసుపులేటి,  అభయ్ రెడ్డి,  సూర్య శ్రీనివాస్,  మాగంటి శ్రీనాథ్,  సిమర్ సింగ్,  తనిష్క్ రాజన్,  అన్వేషి జైన్ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. ఫుట్ లూస్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌,  ఎఫ్3 ప్రొడక్షన్స్ పతాకంపై బల్దేవ్ సింగ్,  నీలిమాలు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.



Also Read: Tollywood: టాలీవుడ్ నిర్మాతల్లో ముసలం.. షూటింగ్స్ ఆపేది లేదు.. గిల్డ్ కు షాకిచ్చిన ఫిలిం ఛాంబర్!


Also Read: Rajkummar Rao: ఇల్లమ్మేసిన జాన్వీ కపూర్… కోట్లు కుమ్మరించి కొన్న స్టార్ హీరో.. లాభం ఎంతో తెలుసా?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook