Sukesh Chandrasekhar sent Letter to Jacqueline Fernandez form Jail: వందల కోట్ల మనీ లాండరింగ్, చీటింగ్ కేసులో సుఖేష్‌ చంద్రశేఖర్ అరెస్ట్ అయి ఇప్పుడు ఢిల్లీలోని జైల్లో శిక్షను అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. అయితే సుఖేష్, నోరా ఫతేహి, జాక్వెలిన్ గురించి సోషల్ మీడియలో రకరకాల రూమర్లు వినిపిస్తుండేవి. ఈ మనీలాండరింగ్ కేసులో జాక్వెలిన్, నోరాని కూడా ఈడీ విచారించిన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరికీ సుఖేష్ నుంచి భారీ ఎత్తున బహుమతులు వచ్చిన విషయం తెలిసిందే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక జాక్వెలిన్ కోసం అయితే ఖరీదైన బంగ్లాను కూడా ఇచ్చాడట. శ్రీలంకలో సపరేట్‌గా జాక్వెలిన్ కోసం విల్లా ఉందని కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే జాక్వెలిన్, సుఖేష్‌ ప్రైవేట్ ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో ఎంతగానో హాట్ టాపిక్ అయ్యారు. ఇక ఆ ఫోటోల్లో జాక్వెలిన్ మెడ మీద గాయం సైతం అందరి దృష్టిని ఆకర్షించింది.


ఇప్పుడు ఈస్టర్ సందర్భంగా జాక్వెలిన్ కోసం ఓ లెటర్‌ను జైలు నుంచి సుఖేష్ రిలీజ్ చేశాడు. ఈస్టర్ అనే పండుగ జాక్వెలిన్‌కు ఎంతో ఇష్టమట, ఈ రోజు ఆమెతో లేకపోవడం ఎంతో మిస్ అవుతున్నట్టుగా అనిపిస్తుందంట.. మై బేబీ.. మై బన్నీ రాబిట్ అంటూ జాక్వెలిన్ కోసం ఎమోషనల్ పోస్ట్ చేశాడు.


Also Read:  Akira Nandan Birthday : అకిరా నందన్ బర్త్ డే స్పెషల్.. జూ. పవర్ స్టార్ రేర్ పిక్స్


నువ్ ఎంత అందంగా ఉంటావో.. నీకైనా తెలుసా?.. నీలాంటి అందగత్తె ఈ భూమ్మీద లేనే లేదు.. మై లవ్.. మై బన్నీ రాబిట్ అంటూ జాక్వెలిన్‌ను పొగడ్తలతో ముంచెత్తాడు సుఖేష్. నీ గురించి ఆలోచించని క్షణమంటూ లేదు.. నువ్ కూడా నా గురించి అలానే ఆలోచిస్తుంటావ్ అని నాకు తెలుసు అంటూ చెప్పుకొచ్చాడు.


క్రిమినల్ సినిమాలోని థూ మిలే.. పాటను విన్నప్పుడల్లా నువ్వే గుర్తుకు వస్తావ్.. ఇది ప్రేమ మాత్రమే కాదు.. పిచ్చి.. మై జాక్ బొమ్మ అంటూ సుఖేష్ తన ప్రేమను వ్యక్త పరిచాడు. ఇలా లేఖను రిలీజ్ చేయడం ఇదే మొదటి సారి కాదు. ఆమె బర్త్ డేకు ఒకసారి, అంతకు ముందు ఓ సారి హోలీకి కూడా ఇలానే ప్రెస్ నోట్‌ను రిలీజ్ చేశాడు.


Also Read: Renu Desai-Pawan Kalyan Fan : మీ అన్న కొడుకా?.. అకిరా నా కొడుకు.. పవర్ స్టార్ ఫ్యాన్స్‌పై రేణూ దేశాయ్ ఫైర్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook