Conspiracy on Vijay Devarakonda: `లైగర్`-విజయ్ దేవరకొండపై కుట్ర.. కావాలనే నెగటివ్ టాక్.. వారి పనేనా?
Conspiracy on Vijay Devarakonda and Liger Movie: విజయ్ దేవరకొండ- లైగర్ మూవీ విషయంలో కుట్ర జరిగిందని ప్రచారం జరుగుతోంది. సినిమా మీద నెగటివ్ టాక్ రావడానికి కొందరు కారణం అని అంటున్నారు. ఆ వివరాలు
Conspiracy on Vijay Devarakonda and Liger Movie: విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో అనన్య పాండే హీరోయిన్ గా నటించిన చిత్రం లైగర్. ఈ సినిమాను కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద, పూరి జగన్నాథ్ పూరి కనెక్ట్స్ బ్యానర్ మీద సంయుక్తంగా నిర్మించారు. చార్మి కౌర్, అపూర్వ మెహతా సహ నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ సినిమా ప్రకటించిన నాటి నుంచి తెలుగు ప్రేక్షకులలో అంచనాలు ఏర్పడ్డాయి. తర్వాత సినిమాని ప్యాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కి సిద్ధం చేస్తున్న క్రమంలో హీరోయిన్గా అనన్య పాండేను తీసుకున్నారు. అయితే మైక్ టైసన్ ఇందులో నటిస్తున్నారు అనే విషయం తెరమీదకు రాగానే దాదాపు అన్ని భాషల ప్రేక్షకులలో సినిమా మీద ఆసక్తి ఏర్పడింది.
ఇప్పటివరకు మైక్ టైసన్ కిక్ బాక్సర్ గానే అందరికీ తెలుసు, అలాంటి ఆయన సినిమాలో నటిస్తే ఎలాంటి పాత్రలో నటిస్తారు? విజయ్ దేవరకొండ మైక్ టైసన్ కాంబినేషన్ ఎలా ఉంటుంది? అంటూ అనేక అంచనాలు వెలువడ్డాయి. అలా కామన్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఏర్పరచుకున్న ఈ సినిమా ఎట్టకేలకు ఆగస్టు 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. అయితే సినిమా మొదటి ఆట నుంచి కూడా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. కొందరు ప్రేక్షకులు సినిమా ఏ మాత్రం ఊహించిన విధంగా లేదని పెదవి విరుస్తుంటే మరికొందరు మాత్రం విజయ్ అన్నట్టుగానే సినిమాలో ఆగ్(ఫైర్) ఉందని అందరికీ బాగా నచ్చుతుందని కామెంట్స్ చేస్తున్నారు.
అయితే అసలు విషయం మీద క్లారిటీ రావాలంటే మరో రెండు రోజులు వెయిట్ చేయాల్సిందే. కానీ సినిమా మీద మాత్రం బాగా నెగిటివ్ టాక్ రావడం ఇప్పుడు టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా సినిమా పూర్తిస్థాయిలో చూడని వాళ్ళు కూడా సినిమా అసలేమీ బాలేదని కావాలనే నెగిటివ్ టాక్ సృష్టిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దేవరకొండ ముందు వరుస సూపర్ హిట్లు అందుకుని తర్వాత వరుస డిజాస్టర్లు అందుకున్నారు. ఈ సినిమాతో హిట్టు కొడితే టాలీవుడ్ నుంచి మరో ప్రభాస్ లాంటి హీరో ఇండియాకి అందించినట్లు అవుతుందని అందరూ భావించారు. కానీ ఈ మేర నెగిటివ్ టాక్ రావడానికి కారణం ఇండస్ట్రీలోని ఒక వర్గమే అని అంటున్నారు.
వారు కావాలని సినిమా మీద నెగిటివ్ టాక్ సృష్టిస్తున్నారని వార్తలు బయటకు వస్తున్నాయి. అయితే అలా చేయిస్తున్నది ఎవరు? ఏమిటీ? అనే విషయాల మీద క్లారిటీ లేదు కానీ కావాలని నెగిటివ్ రివ్యూలు బయటికి వచ్చేలా చేస్తున్నారని, పెయిడ్ ఆర్టిస్టుల చేత సినిమా బాలేదని చెప్పిస్తున్నారని ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. నిజానికి విజయ్ దేవరకొండ ఆటిట్యూడ్ కూడా దీనికి కారణం అయి ఉండచ్చని అంచనాలు వెలువడుతున్నాయి. విజయ్ దేవరకొండ ఆ మధ్య ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో కూడా మా తాత తెలవదు మా అయ్యా తెలవదు అయినా నన్ను గుండెల్లో పెట్టుకుంటున్నారు అన్నట్టుగా కామెంట్ చేశాడు. ఆ కామెంట్ కలకలం రేపింది.
నెపోటిజం అనే విషయాన్ని టార్గెట్ గా చేసుకుని విజయ్ దేవరకొండ ఈ కామెంట్స్ చేశాడని అప్పట్లో వార్తలు వినిపించాయి. సాధారణంగా సినీ పరిశ్రమలో బయట నుంచి వచ్చి నిలదొక్కుకున్న హీరోల కంటే తాతలు లేదా తండ్రుల వారసత్వంతో సత్తా చాటుతున్న హీరోలు ఎక్కువగా ఉంటారు. ఇప్పుడు వారందరి ఆగ్రహానికి కూడా విజయ్ గురయ్యాడా అని చర్చలు జరుగుతున్నాయి. అయితే ఇది కేవలం సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారమా? లేక నిజంగానే ఎవరైనా విజయ్ దేవరకొండ మీద కావాలని నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేయిస్తున్నారా? ఆయన సినిమాకి నష్టం చేకూర్చేలా సోషల్ మీడియాని వాడుకుంటున్నారా? అనే విషయాల మీద మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది.
ఈ మొత్తానికి కాలమే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఇక లైగర్ సినిమా విషయానికి వస్తే ఈ సినిమాకి 90 కోట్ల దాకా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. టాలీవుడ్ లో టైర్ 2 హీరోలలో ఉన్న విజయ్ దేవరకొండకు ఈ రేంజ్ బిజినెస్ జరగడం అంటే అది మామూలు విషయం కాదు. అయితే ఇలా నెగిటివ్ టాక్ వస్తే కనుక ఆ స్థాయిలో వసూళ్లు రాబట్టడం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చాలా కష్టమైన విషయం అని చెప్పాలి. నార్త్ ప్రేక్షకులకు సినిమా కనెక్ట్ అయితే నార్త్ లో వసూళ్ల వర్షం కురిసే అవకాశం కనిపిస్తుంది. మరి ఈ నెగిటివ్ ట్రెండ్ మాత్రం సినిమాకు ఇబ్బంది కలిగించక తప్పదనే చెప్పాలి.
Also Read: Liger Movie Review: విజయ్ దేవరకొండ "నత్తి విశ్వరూపం" ఎలా ఉందంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి