Bigg Boss Brothal House : బిగ్‌బాస్ తెలుగు ఓటీటీ వెర్షన్ గ్రాండ్ లాంచ్ జరిగింది. షో ప్రారంభమైన రోజే వివాదాస్పద వ్యాఖ్యలు చోటుచేసుకున్నాయి. బిగ్‌బాస్ హౌస్ ఒక బ్రోతల్ హౌస్ అంటూ ఓ ప్రముఖ వ్యక్తి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పటివరకూ బుల్లితెరకే పరిమితమైన బిగ్‌బాస్ తెలుగు ఇప్పుడు ఓటీటీ వెర్షన్ ప్రారంభమైంది. 17 మంది కంటెస్టెంట్లతో 84 రోజులపాటు నాన్‌స్టాప్‌గా సందడి చేసేందుకు సిద్ధమైంది. ఇవాళ కాస్సేపటి క్రితం అంటే సాయంత్రం 6 గంటలకు కింగ్ నాగార్జున హోస్ట్‌గా గ్రాండ్ లాంచ్ జరిగింది. అషురెడ్డి, అర్యానా, తనీష్, నిఖిల్, ముమైత్ ఖాన్ వంటి పాత కంటెస్టెంట్లు మరోసారి ఎంట్రీ ఇచ్చారు. ఇక ఓ వైపు బిగ్‌బాస్ తెలుగు గ్రాండ్ లాంచ్ జరుగుతుండగానే సీపీఐ నేత నారాయణ నోటికి పనిచెప్పారు. బిగ్‌బాస్ హౌస్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.


బిగ్‌బాస్ హౌస్‌ను ఓ బ్రోతల్ హౌస్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు సీపీఐ నేత నారాయణ. డిస్నీ హాట్‌స్టార్‌లో ప్రసారం కానున్న ఈ షోపై ఇప్పటికే పలువురు సామాజిక కార్యకర్తలు, పార్టీల నేతలు, మాజీ బిగ్‌బాస్ కంటెస్టెంట్లు కూడా పలు సందర్భాల్లో విమర్శలు చేశారు. షో ప్రారంభమైన రోజే వివాదాస్పద వ్యాఖ్యలు రావడం దుమారం రేగుతోంది. బిగ్‌బాస్ షోని బ్రోతల్ షోగా పోల్చారు. బిగ్‌బాస్ అనేది సమాజానికి నేరపూరితమైన సంస్థ అని మండిపడ్డారు. ఇది కల్చరల్ షో, కల్చరల్ ఈవెంట్, గేమ్ షో కానేకాదన్నారు. అంతేకాకుండా..లైసెన్స్ తీసుకున్న బ్రోతల్ హౌస్ అంటూ తీవ్ర వ్యాఖ్యలే చేశారు. ఇదొక పెద్ద నాన్సెన్స్ అంటూ కామెంట్ చేశారు. ఏ మాత్రం సంబంధం లేని యవతీ యువకుల్ని ఒకే ఇంట్లో పెట్టడం, షో పేరుతో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించడమేంటని మండిపడ్డారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ షోను నిషేధించాలని డిమాండ్ చేశారు. స్టాప్ బిగ్‌బాస్ హ్యాష్‌ట్యాగ్‌తో ప్రచారం ప్రారంభించారు. 


Also read: Bigg Boss Telugu OTT Launch: గ్రాండ్‌గా ప్రారంభమైన బిగ్‌బాస్ తెలుగు ఓటీటీ, తొలి కంటెస్టెంట్‌గా అషురెడ్డి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook