CPI Narayana sensational comments: బిగ్‌బాస్ ఓ `బ్రోతల్ హౌస్`, `రెడ్‌లైట్ సంస్కృతి` నారాయణ కామెంట్స్ (వీడియో)
ఎప్పటిలాగే సీపీఐ నాయకుడు నారాయణ బిగ్‌బాస్ సీజన్ పై సంచలన కామెంట్స్ చేసారు. బిగ్‌బాస్ ఓ `బ్రోతల్ హౌస్`, `రెడ్‌లైట్ సంస్కృతి అని.. కామెంట్స్ చేసారు. ఇంకేం అన్నారంటే..??
CPI Narayana sensational comments: బిగ్‌బాస్ షో (Bigg Boss Telugu season 5) ప్రారంభమైన ప్రతి సారి సీపీఐ నాయకులు నారాయణ (CPI Narayana) నిషేధించాలని కోరుకునే ఉన్నారు. ప్రతి సారి లానే ఈ సారికూడా షో పై విరుచుకుపడ్డ నారాయణ.. ఇలాంటి షోల వల్ల లాభం ఏంటని ప్రశ్నించారు.
మంగళవారం ముక్దూం భవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడుతూ... బిగ్‌బాస్ ఓ 'బ్రోతల్ స్వర్గమని', 'రెడ్‌లైట్ సంస్కృతి' అని ‘బిగ్ బాస్ వల్ల ఎవరికైనా ఉపయోగం ఉంటుందా... సమాజానికి ఇలాంటి షోల వల్ల ఏం ఉపయోగం’అంటూ విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి షోలకు ఎలా అనుమతి ఇస్తున్నాయని ప్రశ్నించారు. ఈ షో ఒక బూతు ప్రపంచం, అన్ని రకాలుగా వ్యాపార నిమిత్తం వాడుకుంటున్నారని ఎన్నో సార్లు కోర్టులో వ్యాజ్యం వేసినా పోలీసు వ్యవస్థ, న్యాయవ్యవస్థ తనకు సహకరించలేదని తెలిపారు.
Also Read: Shocking Viral Video: 'శరీరాన్ని వదిలి వెళ్లిపోతున్న ఆత్మ'... ఫన్నీ వైరల్ వీడియో!
ఈ కార్యక్రమం నిలిపివేసేనుకు మళ్లీ కోర్టుకు వెళ్తానని, బిగ్‌బాస్ హౌస్‌లో యువతీ-యువకులను 107 రోజులు ఒకే గదిలో పెట్టడం.. ముద్దులు, డేటింగ్ ల (Dating) పేరుతో సాంస్కృతి క దోపిడీ చేస్తున్నారని నారాయణ ఆరోపించారు. ఈ కార్యక్రమాన్ని 24 గంటల పాటు బ్రేక్ లేకుండా ప్రత్యక్ష ప్రసారం చేయగలరా?? అని చాలెంజ్ చేసారు.
అంతేకాకుండా, గతేడాది బిగ్‌బాస్ సీజన్ 4 లో హోస్ట్ గా వ్యవహరించిన నాగార్జునపై (Bigg Boss Host Nagarjuna) కూడా మండిపడ్డారు. దేశ సంస్కృతిని, సంప్రదాయాలను మంట కలుపుతున్నారని.. నాగార్జున గారు కళామతల్లికి అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు.
Also Read: RBI: ఆర్బీఐ కీలక నిర్ణయం, ఇకపై విదేశాల్లో సైతం కూడా యూపీఐ చెల్లింపులు
బిగ్‌బాస్ సీజన్ 5 షో ఈ నెల 5న షో ప్రారంభమైంది. మొత్తం 19 మందిని హౌస్ లోకి పంపగా ఆదివారం 'సరయు' ఎలిమినేట్ అవ్వగా ఇక 18 మంది బిగ్‌బాస్ హౌస్ లో ఉన్నారు. నిజానికి బిగ్‌బాస్ 5 వ సీజన్ ఈ సంవత్సరం జూన్ లోనే ప్రారంభం అవ్వల్సింది ఉండగా.. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఈ సీజన్ లో సీనియర్ నటీమణులు ప్రియ, ఉమా, యాంకర్ రవి (Anchor Ravi), యానీ మాస్టర్, కమెడియన్ లోబో (Lobo), యూట్యూబ్ స్టార్లు సిరి హనుమంత్, షణ్ముక్ జస్వంత్ (Shanmukh Jaswanth), మోడల్ జెస్సీ, సింగర్ శ్రీరామ చంద్ర (Singer Srirama Chandra), సీరియల్ హీరోలు మానస్, సన్నీ, ఆర్జే కాజల్, ట్రాన్స్ జెండర్ ప్రియాంక సింగ్ వంటి వారు కంటేస్టంట్స్ గా ఉన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook