Game Changer Update: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్-స్టార్ డైరెక్టర్ కాంబోలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్. ఇందులో చరణ్ కు జోడిగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటిస్తోంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. గత కొన్ని రోజులగా ఈ మూవీ నుంచి ఎటువంటి అప్ డేట్ లేదు. దీంతో మెగా అభిమానులు పూర్తి నిరాశలో ఉన్నారు. తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ అప్ డేట్ ను ప్రకటించారు మేకర్స్. గేమ్ ఛేంజర్ లేటెస్ట్ షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుందని డైరెక్టర్ శంకర్ ట్వీట్ చేశారు. ఇందులో అక్టోబరు 11 నుంచి కీలకమైన ఎమోషనల్ సీన్స్ ని షూట్ చేస్తున్నట్లు శంకర్ పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ చరణ్ ఫ్యాన్స్ లో పుల్ జోష్ నింపింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ముందుగా ఈ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దింపాలని మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ షూటింగ్ కు బ్రేక్ పడటంతో ఈ మూవీ రిలీజ్ ను సమ్మర్ కు పోస్ట్ పోన్ చేశారు మేకర్స్. అయితే తాజా షెడ్యూల్ తో గేమ్ ఛేంజర్ ప్రధాన భాగం షూటింగ్ పూర్తి చేసేందుకు శంకర్ ప్రణాళికలు రచిస్తున్నాడు. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ జోనర్ లో వస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ యాక్టర్ హ్యారీ జోష్, ఎస్జే సూర్య, శ్రీకాంత్, సముద్రఖని, జయరామ్, సునీల్, నవీన్ చంద్ర తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నరు. ఈ మూవీకి కార్తీక్ సుబ్బరాజు కథను అందించగా.. సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాస్తున్నారు. ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ ఫ్లాన్ చేస్తున్నారు. 



Also Read: Skanda OTT: నెల తిరగకుండానే ఓటీటీలోకి రామ్ 'స్కంద'.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి