Naga Chaitanya Custody Teaser: నన్ను చావు వెంటాడుతోంది.. ఆసక్తికరంగా నాగచైతన్య `కస్టడీ` టీజర్!
Naga Chaitanya Custody Movie Teaser Out. టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య, కృతి శెట్టి నటిస్తున్న తాజా చిత్రం `కస్టడీ`టీజర్ అయింది.
Naga Chaitanya, Krithi Shetty Starrer Custody Teaser Released: టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం 'కస్టడీ'. తమిళ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో నాగచైతన్యకు జోడీగా కృతి శెట్టి నటిస్తుంది. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డ్రామాగా తెరకెక్కుతున్న కస్టడీ సినిమాలో చై పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ సినిమాను మే 12 వ తేదీన భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. కస్టడీ సినిమా, పోస్టర్స్ రిలీజ్ దగ్గర నుంచే అందరిలో ఆసక్తిని పెంచాయి.
కొద్ధిసేపటి క్రితమే కస్టడీ సినిమా టీజర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ప్రధానమైన పాత్రలపై కట్ చేసిన టీజర్.. ఆద్యంతం ఆసక్తిని రేపుతోంది. ఒక నిమిషం 20 సెకండ్ల నిడివి గల ఈ టీజర్.. 'గాయపడిన మనుసు ఆ మనిషిని ఎంత దూరమైనా తీసుకెళుతుంది' అనే డైలాగ్ తో ఆరంభం అయింది. 'ఇక్కడ చావు నన్ను వెంటాడుతోంది . అది ఎప్పుడు ఎక్కడి నుంచి ఎలా వస్తుందో నాకు తెలియదు', 'నిజం ఒక ధైర్యం.. నిజం ఒక సైన్యం.. అది ఇప్పుడు నా కస్టడీలో ఉంది' అనే డైలాగ్స్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.
మే 12న ప్రేక్షకుల ముందుకు రానున్న కస్టడీ సినిమా టీజర్.. పవర్‌ఫుల్ డైలాగ్స్, యాక్షన్ సీక్వెన్స్‌తో రూపొంచారు. ఈ టీజర్ ప్రతుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 'బంగార్రాజు' తరువాత కృతి శెట్టి, నాగచైతన్య కలిసి మరోసారి ఈ సినిమాలో నటించారు. ఇళయరాజా ఆయన తనయుడు యువన్ శంకర్ రాజా కలిసి ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు. అరవింద్ స్వామి, శరత్ కుమార్, సంపత్ రాజ్, ప్రియమణి లాంటి స్టార్స్ ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు.
Also Read: MS Dhoni IPL Career: ఐపీఎల్ 2024లో ఎంఎస్ ధోనీ ఆడతాడా?.. సురేష్ రైనా సమాధానం ఇదే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.