Daggubati Suresh Babu and Rana is Linked indirectly with MLAs poaching case Accused: తెలంగాణలో ఎమ్మెల్యేలకు ఎర కేసులో నందకుమార్ అనే వ్యక్తి అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అతను బిజెపి పార్టీకి చెందిన వ్యక్తి అని కావాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రయత్నించాడని ప్రభుత్వం తరఫున పోలీసులు కేసు నమోదు చేశారు. ఒక స్ట్రింగ్ ఆపరేషన్ కూడా నిర్వహించి అనేక వీడియో సాక్షాలు కూడా సేకరించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే తాజాగా అతనికి జిహెచ్ఎంసి షాక్ ఇచ్చింది. అసలు విషయం ఏమిటంటే ఈ నంద కుమార్ ఎవరో కాదు గతంలో సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు, అలాగే ఆయన సోదరుడు వెంకటేష్ తనను మోసం చేశారంటూ కోర్టుకు ఎక్కిన నందకుమార్ అప్పట్లో తనను సదరన్ స్పైస్ గ్రూప్ ఆఫ్ చైర్మన్ ప్రకటించుకున్నారు. ఇక కొన్నాళ్ల క్రితం సిటీ సివిల్ కోర్టు ఎదుట మీడియాతో మాట్లాడుతూ అప్పట్లో తనకు లీజుకి ఇచ్చిన భూమిని తనతో పాటు మరొకరికి కూడా అగ్రిమెంట్ చేసి సురేష్ బాబు మోసం చేశారని అంతేగాక కోర్టు ఆదేశాలను సైతం లెక్కచేయకుండా తన కుమారుడు రానా పేరిట రిజిస్ట్రేషన్ చేశారని అప్పట్లో ఆరోపణలు గుప్పించారు.


వీరు మాత్రమే కాకుండా వెంకటేష్ సైతం తనకు 1200 గజాల భూమిని లీజు అగ్రిమెంట్ చేశారని, అయితే అదే స్థలం నుంచి నుంచి కూడా తనను బలవంతంగా ఖాళీ చేయించేందుకు దగ్గుబాటి కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తున్నారని అప్పట్లో ఆరోపించారు. ఇక ఇదే కేసు నిమిత్తం రానా కూడా పలుసార్లు వాయిదాలకు తిరుగుతూ మీడియా కంట పడ్డారు. అయితే ఇప్పుడు అదే వ్యక్తి ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో అరెస్ట్ అవడంతో తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది.


ఏదైతే ప్రాపర్టీ వ్యవహారం కోర్టులో ఉందని అంటున్నారో అదే ప్రాపర్టీలో కొంత భాగాన్ని జిహెచ్ఎంసి అధికారులు కూల్చి వేసినట్లు తెలుస్తోంది. = డెక్కన్ కిచెన్ పేరుతో ఏర్పాటుచేసిన హోటల్ లోని కొంత భాగాన్ని అధికారులు కూల్చి వేసినట్లు చెబుతున్నారు. దాన్ని ఇల్లీగల్ నిర్మాణం అని చెబుతూ ఎలాంటి అనుమతి లేకుండా తన నిర్మించారని చెబుతూ కూల్చివేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ క్రమంలో నందకుమార్ వ్యవహారం మరోసారి తెలంగాణ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి కనిపిస్తోంది.


Also Read: Shock to Dil Raju: దిల్ రాజుకు షాకిచ్చిన తెలుగు నిర్మాతల మండలి.. దెబ్బ అదుర్స్ కదూ!


Also Read: Five Heorines in Yashoda: సమంత సహా 'యశోద'లో ఐదుగురు హీరోయిన్లు.. ఎవరెవరో తెలుసా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook