Daksha Nagarkar Shares her Sizzling Photo: ముంబై భామ దక్ష నగార్కర్ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అప్పుడెప్పుడో ఏకే రావు పీకే రావు అనే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినా ఆ సినిమా చేసినట్టు రిలీజ్ అయినట్టు కూడా చాలా మందికి తెలియదు. ఆ తర్వాత హోరాహోరీ అనే సినిమాలో కూడా నటించింది కానీ ఆ సినిమా కూడా ఏమాత్రం పేరు తీసుకురాలేదు. అయితే హర్ష కానుగంటి దర్శకత్వంలో తెరకెక్కిన హుషారు సినిమా ఆమెకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే వెంటనే ఆమెకి అవకాశాలు అయితే దక్కలేదు కరోనా ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆమె జాంబీ రెడ్డి అనే సినిమాలో మ్యాగీ పాత్రలో కనిపించి. ఆ సినిమాతో ఆమె ఒక్కసారిగా టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది జాంబీ రెడ్డి తర్వాత ఆమెకు వరుస అవకాశాలు తలుపు తడుతున్నాయి. అయినా ఏ మాత్రం తొట్రు పడకుండా చాలా తెలివిగా తనకు పనికొస్తాయి అనుకున్న సినిమాలు మాత్రమే ఎంచుకుంటూ ముందుకు వెళుతుంది. జాంబీ రెడ్డి సినిమా తర్వాత బంగారు రాజు అనే సినిమాలో ఒక స్పెషల్ ఎప్పిరియన్స్ కూడా ఇచ్చింది.


ఎంత సక్కగుందిరో అనే సాంగ్లో కనిపించడమే కాదు ఒక చిన్న పాత్ర కూడా చేసి నాగచైతన్యతో కలిసి అలరించింది. ఆ మధ్య ఈ బంగారు రాజు ఈవెంట్లో నాగచైతన్య వంక అదోలా చూస్తూ ఉండగా కెమెరా కంటికి చెక్కడంతో వారిద్దరి మధ్య ఏదో ఉందనే ప్రచారాలు కూడా తెరమీదకు వచ్చాయి. అయితే అదేమీ నిజం కాదు అని తర్వాత క్లారిటీ వచ్చేసింది కూడా.  ప్రస్తుతానికిఆమె  రావణాసుర అనే ఒక సినిమా చేస్తోంది. రవితేజ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో  దక్ష నగార్కర్ తో పాటు మరో అయిదుగురు భామలు కూడా నటిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ భామ గురించి చెప్పాల్సిందేమిటంటే తాజాగా ఆమె సోషల్ మీడియాలో ఒక హాట్ ఫోటో షేర్ చేసింది.



ముఖం చూపించకుండా ముఖానికి చేయి అడ్డుపెట్టుకుని ఒక వైట్ కలర్ డ్రెస్ లో ఆమె కనిపించింది. వెనక్కి తిరిగి ఫోటోకి ఫోజులు ఇవ్వడంతో ఆమె ఫోటో సూపర్ హాట్ గా ఉందని కొందరు కామెంట్లు పెడుతున్నారు/ ఒకరు నేను మీ జిమ్ క్లాస్ లో జాయిన్ అవ్వచ్చా అని అడిగితే మరొకరు జాంబి రెడ్డి సినిమా చూసిన తర్వాత నువ్వే నా క్రష్ గా మారిపోయావు అని మరొకరు కామెంట్ చేశారు. మరో నెటిజన్ మా పాపకి ఛాన్సులు ఇవ్వండి రా, టాలెంట్ అంతా వేస్ట్ చేయనివ్వకండి చూడాల్సింది ఎంతో ఉంది ఇక్కడ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఒక నెటిజన్ అయితే మరో అడుగు ముందుకేసి అవి తొడలా మసాలా వడలా అనే కామెంట్ కూడా చేశారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ఫోటో మీద మీరు కూడా ఒక లుక్కేయండి మరి.


Also Read: Shock to Rashmika: రష్మికకు పుష్ప షాక్.. ఆ దెబ్బకు కత్తిరించేశారా?


Also Read:  VBVK postponed: వాయిదా పడిన 'విష్ణు కధ'.. త్యాగమా? సెంటిమెంటా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook