Sai Pallavi as Sita: రామాయణం ఆధారంగా సినిమా అనగానే ఈమధ్య అందరికీ గుర్తు వస్తున్న పేరు ఆది పురుష్. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ డైరెక్టర్ తీసిన ఈ సినిమా కలెక్షన్ ల పరంగా బాగానే ఆడింది. కానీ అభిమానుల నుంచి మాత్రం సినిమాకి తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. ముఖ్యంగా ఈ సినిమాలో శ్రీరాముడు, రావణుడు.. ఆంజనేయస్వామిని చూపించిన విధానాలు ప్రేక్షకుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయి అని చాలామంది కామెంట్లు చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఈ మధ్యనే సంక్రాంతి సందర్భంగా హనుమంతుడి కథ ఆధారంగా తెరకెక్కిన హను మ్యాన్ సినిమా ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకుంది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ హీరోగా నటించిన ఈ సినిమా ఇప్పుడు బ్లాక్ బస్టర్ గా నిలిచింది. భారీ బడ్జెట్ తో నిర్మించిన ఆది పురుష్ కూడా చేయలేకపోయిన పని తక్కువ బడ్జెట్ తో వచ్చిన ఈ చిత్రం సాధించి చూపించింది.


తాజాగా ఇప్పుడు మరోసారి బాలీవుడ్ లో దంగల్ సినిమాకి దర్శకత్వం వహించిన నితీష్ తివారి  రామాయణం ఆధారంగా ఒక సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో క్యాస్ట్ విషయంలో వస్తున్న వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.


ఈ సినిమాలో శ్రీరాముడి పాత్రలో రణబీర్ కపూర్, సీతమ్మ పాత్రలో సాయి పల్లవి, రావణాసురుడి పాత్రలో కన్నడ రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్నట్లు చాలా రోజుల నుంచి వార్త చెక్కర్లు కొడుతూనే ఉంది. ఈ ముగ్గురు నటీనటుల పేర్లు బయటకు రావడంతో సినిమాపై బజ్ కూడా బీభత్సంగా పెరిగిపోయింది.


ప్రముఖ బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరన్ ఆదర్శ్ ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ ట్వీట్ కూడా చేశారు. ఇక రామాయణం మూడు భాగాలుగా తెరకెక్కుతుందని ఆయన చెప్పుకొచ్చారు. ప్రముఖ టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ కూడా ఈ సినిమాలో భాగం కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి కానీ అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. ఇది పద్యంలో ఈ చిత్రానికి రంగం మొత్తం సిద్ధమైందట. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం వచ్చే నెల మొదట్లో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కావచ్చని వినిపిస్తోంది. అంతేకాకుండా సినిమా యూనిట్ మొత్తం ఒకసారి అయోధ్యకు వెళ్లి రావాలని కూడా నిర్ణయించుకున్నారట. ఇక అప్పుడే సినిమాని అధికారికంగా ప్రకటించి నటి నటుల వివరాలు బయట పెడతారట. కాగా ఇప్పటికే రణబీర్ కపూర్ ఈ సినిమాలో రాముడు పాత్ర కోసం నాన్ వెజ్ తినడం మానేసి ఈ సినిమా కోసం ప్రిపేర్ అవుతూ ఉండగా.. త్వరలోనే యష్, సాయి పల్లవి కూడా ఈ సినిమా కోసం కసరత్తు చేయనున్నారట.


మరి ఈ సినిమా అయినా మంచి విజయాన్ని సాధిస్తుందా లేక ఆది పురుష్ సినిమా లాగా బాక్సాఫీస్ వద్ద చతికిలపడుతుందా అని ఇంకా తెలియాల్సి ఉంది.


Read: Ayodhya Crown: అయోధ్య రాముడికి స్వర్ణ కిరీటం.. వజ్రాలు, విలువైన రాళ్లు పొదిగినది ఎన్ని కోట్లు అంటే?


Also Read: BRS Party MLAS Meet Revanth: బీఆర్‌ఎస్‌ పార్టీలో కలకలం.. సీఎం రేవంత్‌ను కలిసిన నలుగురు ఎమ్మెల్యేలు


 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook