Dasara movies 2024: ముగిసిన దసరా సినిమాల హడావిడి.. విజయం వారిదే..!
Dussehra release 2024: పండగ అంటే చాలు.. వరసగా సినిమాలు థియేటర్స్ లో సందడి చేయడానికి రెడీగా ఉంటాయి. సంక్రాంతికే కాదు దసరాకి కూడా.. సినిమాలు క్యూ కట్టుకొని మరి విరుదలవుతూ ఉంటాయి. ఈ సంవత్సరం కూడా అదే జరిగింది.. అర డజన్ పైగా సినిమాలు థియేటర్స్ వద్ద సందడి చేయడానికి వచ్చాయి. అయితే వాటిల్లో లాభాల బాట పట్టింది మాత్రం కొన్ని సినిమాలే..
Telugu releases October: సాధారణంగా పండుగ హాలిడేస్ ను చాలా మంది హీరోలు క్యాష్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా నిర్మాతలు సినిమా ప్రకటించిన రోజే హాలిడే చూసుకొని మరీ తమ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తూ ఉంటారు. నిజానికి ఇలా పండగ సమయంలో తమ సినిమాలు రిలీజ్ చేయడం వల్ల మంచి రెస్పాన్స్ తో పాటు కలెక్షన్లు కూడా బాగా వస్తాయని మేకర్స్ భావిస్తారు.
ఈ క్రమంలోనే టాలీవుడ్ లో దసరా, సంక్రాంతి పండుగలకు సినిమాల జాతర కొనసాగుతుంది. ఇదే క్రమంలో ఈ దసరాకి కూడా పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. అయితే ఈ దసరాకి ఏ సినిమా విజయం అందుకుంది. ఏ సినిమాకు నిరాశ మిగిలింది అనేది ఇప్పుడు చూద్దాం..
దసరా బరిలో వచ్చిన చిత్రాలలో కాస్తో కూస్తో మెప్పించిన చిత్రం విశ్వం. గోపీచంద్ ఇమేజ్ తో పాటు 30 ఇయర్స్ పృథ్వి కామెడీ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుని పర్వాలేదు అనిపించుకుంది.
బాక్స్ ఆఫీస్ విజయం కోసం ఎదురుచూస్తున్న సుహాస్ జనక అయితే గనక అనే సినిమాతో వచ్చారు. దీనికి తోడు గత చిత్రం గొర్రె పురాణం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అవ్వడంతో ఆ ప్రభావం దీనిపై స్పష్టంగా కనిపించింది. కథలో అంశాలు ఆకట్టుకునేలా లేకపోవడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.
Also Read: KT Rama Rao: మనం వైఎస్సార్, చంద్రబాబుతో కొట్లాడినం.. చిట్టి నాయుడు ఎంత?
సుధీర్ బాబు హీరోగా నటించిన మా నాన్న సూపర్ హీరో చిత్రం ఒక ఎమోషనల్ కథతో రూపొందించామని మేకర్స్ బాగా ప్రమోట్ చేసుకున్నారు. దీంతో దసరా విజేతగా నిలుస్తుందని ఆడియన్స్ అనుకున్నారు. కానీ ఇలాంటి ఎమోషనల్ రైడ్ చిత్రాలు ఓటీటీ లో వస్తే బాగుంటుందని విమర్శకులు సైతం సూచించారు. మొత్తానికి అయితే ఈ సినిమా కూడా ప్రేక్షకులను మెప్పించలేదు.
మరొకవైపు రజనీకాంత్ వెట్టయాన్ చిత్రం భారీ క్యాస్టింగ్ తో పాటు భారీ అంచనాల మధ్య విడుదలైంది. ఈ సినిమా కథ రొటీన్ కమర్షియల్ చిత్రాన్ని తలపించడంతో ప్రేక్షకులను పూర్తిస్థాయిలో ఇంప్రెస్ చేయలేదు. ఈ సినిమా రజిని స్టామినాను మ్యాచ్ చేయలేకపోయింది.
Also Read: Group 1 Mains: గ్రూప్ 1పై ముందుకే తెలంగాణ సర్కార్.. తగ్గేదెలే అంటున్న రేవంత్ రెడ్డి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter