Thalapathy69 Announcement: పేరుకి తమిళ్లో స్టార్ హీరో అయినప్పటికీ.. తలపతి విజయ్ కి తమిళ్ తో పాటే మిగతా రాష్ట్రాల్లో కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తన సినీ ప్రస్థానంలో ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలను ప్రేక్షకులకు అందించిన విజయ్ త్వరలో సినిమాలకి గుడ్ బై చెప్పబోతున్నారు. తన 69వ సినిమా తన కెరియర్ లోనే ఆఖరి సినిమా అని విజయ్ ప్రకటించేసారు. ఈ సినిమా తర్వాత ఆ విజయ్ కేవలం రాజకీయాలతో మాత్రమే బిజీగా ఉండబోతున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ నేపథ్యంలో తలపతి69 సినిమా ఫ్యాన్స్ కి చాలా ప్రత్యేకమైన సినిమా అవుతుంది అని చెప్పుకోవచ్చు. ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ వారు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. తాజాగా ఇవాళ ఫాన్స్ మనసులకు హత్తుకునే విధంగా ఒక ఐదు నిమిషాల 30 సెకండ్ల వీడియోని విడుదల చేసింది నిర్మాణ సంస్థ. విజయ్ ఫ్యాన్స్ కి ఈ వీడియో ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ లాగా అనిపిస్తుంది. 


ఈ వీడియో ఫాన్స్ కి చాలా అందమైన బహుమతిగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఇక ఫ్యాన్స్ చాలా రోజులుగా ఎదురు చూస్తున్నా క్షణాలు త్వరలోనే రాబోతున్నాయి. విజయ ఆఖరి సినిమాకి సంబంధించిన కౌంట్ డౌన్ మొదలైపోయింది. కేవీఎన్ వారు చేసిన అన్ని ప్రకటనలలో.. ఈ సినిమాకి సంబంధించిన ప్రకటన నిజంగా చాలా స్పెషల్ గా మారింది. 


ఈ వీడియో ఇంత స్పెషల్ గా మారడానికి కారణం.. అది ఫాన్స్ కి విజయ్ మీద ఉన్న వల్ల మాలిన ప్రేమకి నిదర్శనం. థియేటర్లలో, వీధుల్లో, అభిమానులు చేసే అల్లరి, వారి గుండె చప్పుడుకి నిదర్శనం ఈ వీడియో. ఎందుకంటే మిగతా హీరోల ఫ్యాన్స్ తో పోలిస్తే విజయ్ ఫ్యాన్స్ కి తమ హీరో పై ఉన్న ప్రేమ కొంచెం ఎక్కువనే చెప్పుకోవచ్చు. విజయ్ కి సంబంధించిన ప్రతి విషయం ఫాన్స్ కి ఒక ఎమోషన్. సిల్వర్ స్క్రీన్ కి మించి లార్జెర్ దాన్ లైఫ్ సినిమాలు చేసిన విజయ్ ను ఆఖరి సారిగా వెండి తెర మీద చూడటం ఫాన్స్ కి నిజంగా చాలా ఎమోషనల్ గా ఉండబోతుంది. 


ఇక తలపతి విజయ్ ప్రయాణంలో చివ‌రి అధ్యాయానికి సంబంధించిన ప్ర‌ట‌క‌న‌ శ‌నివారం నాడు భూమి బ‌ద్ధ‌లయ్యేలా రానుంది. దీనికోసం ఒక అద్భుతమైన వేదిక కూడా సిద్ధంగా ఉంది. అందులో భాగంగా ద‌ళ‌ప‌తి 69కు సంబంధించిన ప్ర‌క‌ట‌న రానుంది. థియేట‌ర్స్‌లో విజయ్ ని చూసి విజిల్స్ వేయడానికి, థియేటర్లు దద్దరిల్లేలా గోల చేయడానికి.. తెర మీద విజయ్ తో కలిసి స్టెప్పులు వేయడానికి ఫ్యాన్స్ కి ఇదే ఆఖరి అవకాశం. ఇక సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే రోజు కూడా ఫ్యాన్స్ కి అంతే స్పెషల్ కాబోతోంది. 


 


 



Also Read: AP Floods: 'డబ్బులు ఊరికే రావు' యజమాని ఏపీ వరదలకు భారీ విరాళం


Also Read: Aarti Ravi: జయం రవి విడాకుల్లో బిగ్‌ ట్విస్ట్‌.. కలిసి ఉంటానని బాంబు పేల్చిన భార్య ఆర్తి రవి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.