Deepika Padukone House Cost: షారుఖ్ ఇంటి పక్కన లగ్జరీ విల్లాను కొన్న దీపిక. ఖరీదు తెలిస్తే షాక్..!
Deepika Padukone To Welcome Baby in New House : బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బ్యూటిఫుల్ కపుల్ గా గుర్తింపు తెచ్చుకున్న రణవీర్ సింగ్, దీపికా పదుకొనే షారుక్ ఖాన్ ఇంటి పక్కన దాదాపు రూ.100 కోట్ల ఖరీదైన ఫ్లాట్ ను కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఈ ఇంటికి షిఫ్ట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే ఈ జంట వచ్చే నెలలో తల్లిదండ్రులుగా ప్రమోట్ కాబోతున్నారు.
Deepika and Ranveer house next to SRK's house: ఇండియన్ సినీ పరిశ్రమలో అత్యంత ధనవంత సెలబ్రిటీగా గుర్తింపు తెచ్చుకున్న షారుక్ ఖాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇటీవల విడుదలైన హురూన్ ఇండియా రిచ్ లిస్ట్ జాబితాలో షారుఖ్ ఖాన్ చోటు సంపాదించుకున్నాడు. ఏకంగా రూ.7300 కోట్ల సంపదతో రికార్డు సృష్టించారు షారుఖ్ ఖాన్. ఆస్తుల పరంగా మాత్రమే కాకుండా ఈ వయసులో కూడా వరుస సినిమాలు చేస్తూ ఆ సినిమాలతో బ్లాక్ బస్టర్ విజయాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు.
ఇదిలా ఉండగా తాజాగా ఈయన ఇంటి పక్కన ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే ఒక లగ్జరీ విల్లాను కొనుగోలు చేసినట్లు సమాచారం. బాలీవుడ్ లవ్లీ కపుల్ రణవీర్ సింగ్ - దీపికా పదుకొనే మరి కొన్ని రోజుల్లో తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందుతున్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం దీపికా పదుకొనే నిండు గర్భంతో ఉంది. సెప్టెంబర్ లో తనకు బిడ్డ పుట్టబోతోందని ఇదివరకే ఆమె వెల్లడించింది. ఇకపోతే తల్లిదండ్రులు కాకమునుపే రణ్వీర్ సింగ్, దీపికా పదుకొనే కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
అందులో భాగంగానే ప్రస్తుతం ఉన్న ఇంటి నుంచి షారుక్ ఖాన్ ఇంటికి సమీపంలో రూ .100 కోట్ల విలువైన ఫ్లాట్ కి ఈ దంపతులు మారినట్లు సమాచారం. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో దీపికా పదుకొనే డిమాండ్ ఉన్న నటిగా పేరు దక్కించుకుంది. కోవిడ్ తర్వాత ఈమె నటించిన చిత్రాలన్నీ కూడా మంచి విజయాన్ని అందుకున్నాయి. ఉదాహరణకు పఠాన్ , జవాన్, ఫైటర్ వంటి హిట్ చిత్రాలతో నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ, ఇటీవలే కల్కి 2898AD చిత్రంలో కూడా నటించి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.
ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉన్న సమయంలోనే గర్భం దాల్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక ఈ ఏడాది ప్రారంభంలో గర్భం ధరించినట్లు శుభవార్త తెలిపిన ఈమె, సెప్టెంబర్ నెలలో తల్లిదండ్రులు కాబోతున్నాము అంటూ ప్రకటించింది.
ఇక ఈ నేపథ్యంలోని షారుక్ ఖాన్ ఇంటికి సమీపంలో అత్యంత ఖరీదైన ఫ్లాట్ ను కొనుగోలు చేసింది దీపికా పదుకొనే. ఏది ఏమైనా పుట్టే బిడ్డ కోసం మందు జాగ్రత్తగా ఇప్పటినుంచే ఈమె అడుగులు వేస్తూ ఉండడం గమనార్హం .ఏది ఏమైనా ఈ ఇల్లు ఖరీదు తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Big Shock To YSRCP: జగన్‌కు షాక్‌ల మీద షాక్.. ఎమ్మెల్సీ పోతుల సునీత రాజీనామా
Also Read: Chandrababu: ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు అసహనం.. మీ వలన పరువు పోతుంది!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.