సిద్ధాంత్ చతుర్వేదితో కిస్సింగ్ సీన్స్ కోసం రణవీర్ అనుమతి తీసుకున్నారా?.. దీపికా పదుకొణె ఏం చెప్పారంటే?
Gehraiyaan Deepika Padukone: గెహ్రియాన్ సినిమాలోని ఇంటిమేట్ సీన్లలో రెచ్చిపోయిన దీపికా పదుకొణె.. భర్త రణవీర్ సింగ్ పర్మిషన్ తీసుకున్నారా? అని సోషల్ మీడియాలో నెటిజన్లు ఆడేసుకుంటున్నారు. ఈ కామెంట్లపై దీపికా మండిపడ్డారు.
Deepika slams Netizens over Intimate Scenes with Siddhant: వివాహేతర సంబంధాల కథాంశంగా తెరకెక్కిన బాలీవుడ్ సినిమా 'గెహ్రియాన్'. శకున్ బత్రా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె, యువ హీరో సిద్దాంత్ చతుర్వేది జంటగా నటించారు. అనన్య పాండే, ధైర్య కర్వా, నసీరుద్దీన్ షా మరియు రజత్ కపూర్ కూడా సినిమాలో నటిస్తున్నారు. ఫిబ్రవరి 11 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో గెహ్రియాన్ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో కాకుండా ఓటీటీలో ఈ సినిమాను విడుదల చేస్తుండడం విశేషం.
ఇప్పటికే విడుదల చేసిన గెహ్రియాన్ ట్రైలర్‌లో దీపికా పదుకొణె, సిద్ధాంత్ చతుర్వేది రొమాన్స్‌తో రెచ్చిపోయారు. ఇద్దరి మధ్య చాలా కిస్సింగ్ సీన్స్ ఉన్నాయి. దీపికా, సిద్ధాంత్ మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరిందని చాలా మంది అంటున్నారు. మరికొందరు మాత్రం దీపికాపై ట్రోల్స్ చేస్తున్నారు. ఇంటిమేట్ సీన్లలో రెచ్చిపోయిన దీపికా.. భర్త రణవీర్ సింగ్ పర్మిషన్ తీసుకున్నారా? అని కొందరు సోషల్ మీడియాలో ఆడేసుకుంటున్నారు. ఈ కామెంట్లపై పొడుగుకాళ్ల సుందరి మండిపడ్డారు. ఇంత తెలివితక్కువగా ఎలా మాట్లాడాతారో అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బాలీవుడ్ బబుల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో దీపికా పదుకొణె మాట్లాడుతూ.... 'మేము ఎలాంటి వ్యాఖ్యలపై స్పందించడం కూడా తెలివితక్కువతనం అవుతుంది. నేను అసలు ఆ వ్యాఖ్యలను చదవను. నా భర్త రణవీర్ సింగ్ కూడా కామెంట్స్ చదవడు. ఛీ ఇంత తెలివితక్కువగా ఎలా మాట్లాడాతారో. సినిమా చూశాక రణ్‌వీర్ గర్వంగా ఫీలవుతాడు. ముఖ్యంగా సినిమాలో నా నటనకు మంత్రముగ్ధుడవుతాడు అని అనుకుంటున్నా. ఏదేమైనా ఇలా ట్రోల్స్ చేయడం బాగోలేదు' అని అన్నారు.
గెహ్రియాన్ సినిమాలో దీపికా పదుకొణె, అనన్య పాండే అక్కాచెల్లెళ్లుగా నటిస్తున్నారని తెలుస్తోంది. దీపిక ఫిట్‌నెస్ ట్రైనర్‌గా కనిపించనున్నారు. వివాహేతర సంబంధాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీలో రొమాన్స్ డోస్ ఎక్కువగానే ఉంది. సినిమాను థియేటర్లల్లో విడుదల చేయాలంటే.. సెన్సార్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావాలి. కానీ సెన్సార్ బోర్డు దగ్గరికి వెళ్తే మూవీలో అసలైన సీన్లకు కత్తెర పడే ఛాన్స్ ఉంది. దాని ప్రభావం సినిమా మొత్తంపై పడుతుంది. అందుకే ఓటీటీలో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook