Deepika Padukone wanted to give pack of condoms to Ranbir Kapoor: బాలీవుడ్ స్టార్లు రణబీర్ కపూర్ (Ranbir Kapoor) మరియు దీపికా పదుకొనే (Deepika Padukone)లు వెండి తెరపై మంచి జోడిగా పేరొందిన విషయం తెలిసిందే. యే జవానీ హై దీవానీ, తమాషా, బచ్నా ఏ హసీనో వంటి సినిమాలో ఈ ఇద్దరి కెమిస్ట్రీ అదిరిపోయింది. రణబీర్-దీపికా సినిమాల్లోనే కాదు రియల్ లైఫ్‌లో కూడా పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు. ఆ తర్వాత ఏమైందో గానీ వాళ్లిద్దరూ బ్రేకప్ కావడం.. కత్రినా కైఫ్‌ ప్రేమలో రణ్‌బీర్ పడటం అన్నీ చకచకా జరిగిపోయాయి. ఇక కత్రినా ప్రేమకు గుడ్ బై చెప్పిన రణబీర్.. ప్రస్తుతం అలియా బట్‌తో సెటిల్ అయ్యాడు. మరోవైపు రణ్‌బీర్‌తో విడిపోయిన అనంతరం డిప్రెషన్‌లోకి వెళ్లిన దీపికా.. రణ్ వీర్‌ సింగ్‌ను పెళ్లాడారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రణబీర్ కపూర్ (Ranbir Kapoor), దీపికా పదుకొనే (Deepika Padukone) తన ప్రేమకు బ్రేకప్ చెప్పినా.. ప్రస్తుతం మంచి స్నేహితులుగా ఉన్నారు. ఎక్కడ కలిసినా పలకరించుకుంటారు. అంతేకాదు కలిసి సినిమాలు కూడా చేస్తున్నారు. అయితే రణబీర్-దీపికా విడిపోయిన తర్వాత మీడియాలో ఒకరి గురించి ఒకరు చాలా విషయాలు చెప్పుకున్నారు. ఈ క్రమంలో గతంలో ఓసారి రణబీర్‌పై దీపికా సెటైర్లు వేశారు. కాఫీ విత్ కరణ్‌ షోకు సోనమ్ కపూర్‌తో కలిసి దీపికా వచ్చారు. ర్యాపిడ్ రౌండ్ సమయంలో రణబీర్‌కు బహుమతిగా ఏమి ఇవ్వాలనుకుంటున్నారు అని దీపికాను అడగ్గా.. 'రణబీర్‌కు కండోమ్‌ల ప్యాక్‌ (Condom Pack)ను బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నా. ఎందుకంటే అతను వాటిని ఎక్కువగా ఉపయోగిస్తాడు' అని చెప్పారు. 


Also Red: కుల్దీప్ యాదవ్‌ను నంబర్‌ 1 అనడంతో తట్టుకోలేకపోయా.. బస్సు కింద పడేసినట్లుగా అనిపించింది: అశ్విన్‌


దీపికా పదుకొనే (Deepika Padukone) అలాంటి షాకింగ్ స్టేట్‌మెంట్స్ చేసినప్పుడు పక్కనే ఉన్న సోనమ్ కపూర్‌ కూడా ఆమెకు మద్దతుగా నిలిచారు. అయితే దీపికా అలాంటి వ్యాఖ్యలు చేయడానికి ఓ కారణం ఉంది. అంతకుముందు రణబీర్ కపూర్ (Ranbir Kapoor) తన సోదరి కరీనా కపూర్ ఖాన్‌తో కలిసి కరణ్ జోహార్ షోకి వచ్చాడు. ర్యాపిడ్ రౌండ్ సమయంలో రణబీర్.. దీపికాను అత్యంత ఆకర్షణీయమైన అమ్మాయిగా అభివర్ణించాడు. అందుకే దీపికా అలా సెటైర్ వేశారు. సోనమ్ కపూర్‌ తన తొలి చిత్రం 'సావరియా' చేసిన సమయంలో రణబీర్ కపూర్‌తో డేటింగ్ చేస్తున్నట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. 


Also Read: Disney Plus Hotstar Subscription: నెట్ ఫ్లిక్స్ బాటలో డిస్నీ+హాట్ స్టార్.. రూ.49లకే సబ్‌స్క్రిప్షన్‌!


2013లో రామ్ లీలా చిత్రంలో జోడీ కట్టిన దీపికా పదుకొనే, రణ్ వీర్‌ సింగ్‌ (Ranveer Singh).. సుదీర్ఘ ప్రయాణం అనంతరం 2018 నవంబర్ 14 పెళ్లితో ఒక్కటయ్యారు. వివాహ బంధం అనంతరం రణ్ వీర్, దీపికాలు దీప్‌వీర్‌గా మారారు. ఇద్దరు కలిసి పలు సినిమాల్లో నటించి ఔరా అనిపించారు. ప్రస్తుతం 'గెహ‌రాయియా' అనే సినిమాను పూర్తి చేశారు దీపికా. ఈ సినిమా టీజ‌ర్ రీసెంట్‌గా విడుద‌ల కాగా.. దీపికా, సిద్ధాంత్ చ‌తుర్వేది మ‌ధ్య స‌న్నివేశాలు టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా మారాయి. బికినీ వేసుకుని బీచ్‌లో చ‌తుర్వేదికి లిప్ లాక్ ఇస్తున్న ఫొటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ తాజా మూవీ 'Project K'లో కూడా దీపికా న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. టీమిండియా మాజీ సారథి కపిల్ దేవ్ బయోపిక్ 83లో కూడా నటించారు. మరోవైపు రణబీర్ కపూర్ (Ranbir Kapoor) 'బ్రహ్మాస్త్ర'తో బిజీగా ఉన్నాడు. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి