Devara: ఎన్టీఆర్ ‘దేవర’కు ఏపీ హైకోర్టు బిగ్ షాక్..
AP High Court Shock to Devara: ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత ఎన్టీఆర్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘దేవర’. ఈ సినిమా కోసం తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్స్ పెంచుకోవడం కోసం ప్రత్యేక అనుమతులు ఇచ్చాయి. ఈ నేపథ్యంలో ఏపీ హైకోర్టు ఎన్టీఆర్ ‘దేవర’కు పెద్ద షాకే ఇచ్చింది.
AP High Court Shock to Devara: దాదాపు ఆరేళ్ల తర్వాత ఎన్టీఆర్ సోలో హీరోగా నటించిన చిత్రం ‘దేవర’. ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ లెవల్లో ఎన్టీఆర్ క్రేజ్ పెరిగింది. మరోవైపు జపాన్ వంటి దేశాల్లో తారక్ సినిమాలకు మంచి ఆదరణ ఉంది. ఈ నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ యాక్ట్ చేసిన ‘దేవర’ మూవీపై భారీ స్థాయిలో అంచనాలు నెలకున్నాయి. ఈ సినిమా దాదాపు రూ. 200 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించడంతో ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక అనుమతులు ఇచ్చారు.
ఇక ఆంధ్ర ప్రదేశ్ లోని చంద్రబాబు సర్కారు.. ఈ సినిమా టికెట్ రేట్స్ ను 14 రోజులు పెంచుకోవడానికి ప్రత్యేక అనుమతులు ఇచ్చారు. దీన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు అయింది. 2 వారాల పాటు టికెట్ ధరలను పెంచుతూ తీసుకుంటూ ఇచ్చి మెమోను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో ఏపీ హైకోర్టు జోక్యం చేసుకుంటూ టికెట్ ధరలను 10 రోజులకే పరిమితం చేయాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.
మరోవైపు ఏపీలో ఈ సినిమా ప్రత్యేక షోల కోసం అనుమతులు జారీ చేసింది. ఒక్క ఆంధ్ర ప్రదేశ్ లోనే రేపు అర్థరాత్రే 325 అదనపు షోలు పడనున్నాయి. దీంతో మొదటి రోజు ఈ సినిమాకు కలెక్షన్స్ భారీగా రాబట్టే అవకాశాలున్నాయి. మరోవైపు ఎన్టీఆర్ కు సోలో హీరోగా తొలి ప్యాన్ ఇండియా మూవీ అని చెప్పాలి. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ. 182 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర హిట్ అనిపించుకోవాలంటే రూ. 184 కోట్ల షేర్ రాబట్టాలి. మొత్తంగా ‘దేవర’కు పాజిటివ్ టాక్ వస్తే కనుక బాక్సాఫీస్ ను షేక్ చేయడం ఖాయం అనే చెప్పాలి. మరోవైపు తెలంగాణలో ఈ సినిమాకు మొదటి రోజు మాత్రమే రూ. 100 పెంచుకోవడానిక అనుమతులు తీసుకున్నారు. రెండో రోజు నుంచి రూ. 50 హైక్స్ తో వారం రోజులు పాటు థియేటర్స్ లో ప్రదర్శితం కానుంది.
ఇదీ చదవండి: ఎన్టీఆర్ ఇంటిని చూశారా.. బృందావనాన్ని మించిన తారక్ ఇల్లు..!
ఇదీ చదవండి: మహాలయ పక్షంలో ఏ తిథి రోజు శ్రార్ధం పెడితే ఎలాంటి ఫలితాలుంటాయి.. !
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.