Devera: విడుదలకు ముందే సీనియర్ నిర్మత పై కొరటాల ఫైర్.. ఏమైందంటే..?
Koratala Siva Sensational Comments: ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న సినిమా దేవర. ఈ చిత్రం ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా ప్రమోషన్స్ కూడా భారీగా ప్లాన్ చేస్తున్నారు సినిమా యూనిట్. ఇందులో భాగంగా.. ఈ మధ్యనే కొరటాల శివ, ఎన్టీఆర్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో దర్శకుడు చేసిన.. కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి.
Koratala Shiva about Acharya: యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం దేవర. ఈ యేడాది అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రాలలో ఇది కూడా ఒకటి. సెప్టెంబర్ 27వ తేదీన చాలా గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఎంపిక ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నారు. ఇదివరకే సైఫ్ అలీ ఖాన్ ప్రభాస్ హీరోగా నటించిన ఆది పురుష్ సినిమాలో రావణ క్యారెక్టర్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా డిజాస్టర్ గా నిలిచింది .ఇప్పుడు ఈ సినిమాతో ఎలాగైనా విజయం కొట్టాలని భావిస్తున్నారు. అందులో భాగంగానే ఈ సినిమాలో తన అద్భుతమైన విలనిజంతో ఆడియన్స్ ని..మెప్పించే ప్రయత్నం చేయబోతున్నారు.
కాగా యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రంగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న దేవర సినిమాకు సంబంధించి ప్రీ సేల్స్ బుకింగ్ మొదలయ్యాయి. ఉత్తర యూఎస్ఏ లో ట్రైలర్ విడుదల కాకముందే వన్ మిలియన్ డాలర్ వసూలు చేసింది ఈ సినిమా. ఇదిలా ఉండగా ప్రమోషన్స్ లో భాగంగా దేవర ఫన్ అండ్ ఫియర్ పేరిట ఒక ఇంటర్వ్యూ నిర్వహించారు. అందులో ఎన్టీఆర్, కొరటాల శివ , విశ్వక్ సేన్ తో పాటు సిద్ధూ జొన్నలగడ్డ కూడా పాల్గొన్నారు.
ఇందులో కొరటాల శివ మాట్లాడుతూ.. 49 సంవత్సరాలు కలిగిన ఒక చరిత్ర నిర్మాత.. నా మనుపటి చిత్రం ఆచార్యను దృష్టిలో పెట్టుకొని నాపై పరోక్షంగా ఆగ్రహం వ్యక్తం చేశాడంటూ విరుచుకుపడ్డారు.
కొరటాల శివ మాట్లాడుతూ.. “ప్రతి ఒక్కరు కూడా తమ పనికి కట్టుబడి, ఇతరుల వ్యాపారంలో వేలు లేదా తలలు పెట్టకుండా ఉంటే అది అత్యంత శాంతియుతంగా అంకితభావంతో ఆ పని జరుగుతుంది. ఇదే జరిగితే అన్ని విషయాలు సజావుగా సాగిపోతాయి” అంటూ తెలిపారు కొరటాల శివ. అంతేకాదు ఆచార్య సినిమా డిజాస్టర్ తర్వాత రామ్ చరణ్ తో పాటు మెగాస్టార్ చిరంజీవి కూడా కొరటాల శివ పై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.. ఇక కొరటాల శివ కూడా అంతకు ముందు వరకు భారీ విజయాలను అందుకొని ,ఈ ఒక్క చిత్రంతో భారీ డిజాస్టర్ ను మూటగట్టుకున్నారు. ఈ సినిమా కారణంగా ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు.
ఈ క్రమంలోని సీనియర్ నిర్మాత అయిన ఒక వ్యక్తిపై ఆచార్య సినిమా విషయంలో దేవర విడుదల కాకముందే ఫైర్ అయ్యి అందరినీ ఆశ్చర్యపరిచారు కొరటాల శివ. ఇక దేవర సినిమా విషయానికి వస్తే, ప్రకాష్ రాజ్, మురళీ శర్మ, శ్రీకాంత్ మేక, షైన్ టామ్ చాకో , చైత్ర రాయ్, కలైయరసన్ తో పాటు పలువురు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Also Read: ఎన్టీఆర్ ఇంటిని చూశారా.. బృందావనాన్ని మించిన తారక్ ఇల్లు..!
Also Read: మహాలయ పక్షంలో ఏ తిథి రోజు శ్రార్ధం పెడితే ఎలాంటి ఫలితాలుంటాయి.. !
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.