Janhvi Kapoor in Devara: సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటి శ్రీదేవి. ఆమె ఎన్నో భాషల్లో అద్భుతమైన నటనతో అభిమానుల మనసులను గెలుచుకున్నారు. బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్‌ను వివాహం చేసుకున్న శ్రీ దేవికి ఇద్దరు కుమార్తెలు. పెద్దమ్మాయి జాన్వీ కపూర్ కాగా ఖుషి కపూర్ చిన్న కూతురు. ప్రస్తుతం ఈ ఇద్దరు కుమార్తెలు.. కూడా బాలీవుడ్‌లో హీరోయిన్ లుగా నెట్టుకొస్తున్నారు. అయితే, శ్రీదేవి తన చిన్న కుమార్తె ఖుషి కపూర్‌ నటి అయినా పర్వాలేదు కానీ.. పెద్ద కుమార్తె జాన్వీ మాత్రం సినిమాలకి దూరంగా ఉండాలి అని అనుకున్నారట.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జాన్వీ కపూర్ ధడక్ సినిమాతో హీరోయిన్ గా తన కెరియర్ మొదలు పెట్టింది. ఆ తర్వాత కూడా మంచి స్క్రిప్ట్ సెలక్షన్ తో మిలీ, గుంజన్ సక్సేనా, మిస్టర్ అండ్ మిసెస్ మాహి వంటి హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించింది. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర చిత్రంతో ఈ భామ టాలీవుడ్‌లోకి కూడా అడుగుపెట్టబోతోంది. ఈ సినిమా తర్వాత టాలీవుడ్‌లో మరో మూడు చిత్రాలు కూడా ఆమె చేతిలో ఉన్నాయి.


ఇదిలా ఉండగా, ఖుషి కపూర్.. జోయా అక్తర్ దర్శకత్వంలో ఆర్చీస్ అనే మ్యూజికల్ సినిమాతో తన కెరియర్ ను ప్రారంభించింది. ఈ సినిమాలో చాలా మంది స్టార్ కిడ్స్ కూడా నటించారు. ఖుషి కపూర్‌ కి బాలీవుడ్ లో బాగానే అవకాశాలు వస్తున్నాయి. అయితే జాన్వీ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ విషయాన్ని బయట పెట్టింది. 


జాన్వీ కపూర్‌ తన తల్లి శ్రీదేవి గురించి మాట్లాడుతూ, "మా అమ్మ ఎప్పుడూ నేను నటి కావాలని కోరుకోలేదు. నటిగా ఉండటం ఎంత కష్టం అనే విషయం తెలుసు.. కాబట్టి.. అమ్మ నన్ను ఎప్పుడూ ఈ దారిలోకి రాకుండా డీవియేట్ చేయాలని అనుకునేది. నన్ను ఒక డాక్టర్ గా చూడాలని అనుకుంది. కానీ నాకు నటన తప్ప మరోటి రాదు" అని చెప్పింది జాన్వీ. 


అయితే శ్రీదేవి తన చిన్న కూతురు ఖుషి నటిగా మారినా పర్లేదు అని అనుకున్నారట. "ఖుషి చిన్నప్పటి నుండి స్వతంత్రంగా, ధైర్యంగా ఉండేది. అందుకే తను సినిమాల్లోకి వెళ్ళినా బాగానే ఉండగలదు అని అమ్మ అనుకునేది" అని చెప్పింది జాన్వీ కపూర్.


Also Read: Entertainment news: పనిమనిషి అంటూ ఇంట్లో చేరిన మంత్రి కుమార్తె.. కట్ చేస్తే..!


Also Read: Thalapathy 69: విజయ్ ఆఖరి సినిమా అప్డేట్ గురించి ఆసక్తికర విషయం చెప్పేసిన నిర్మాణ సంస్థ..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.