Devara OTT Platform: దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత సోలో హీరోగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మొదటి షో నుంచే మంచి హిట్ టాక్ తో దూసుకుపోతుంది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా అంతకుమించి హైప్ క్రియేట్ అయ్యిందని చెప్పవచ్చు. దాదాపు రూ .3500 పెట్టి కూడా టికెట్ కొనుగోలు చేసి సినిమా చూసిన ఆడియన్స్ కూడా ఉన్నారు. దీన్ని బట్టి చూస్తే ఎన్టీఆర్ పై ఏ రేంజ్ లో అభిమానం ఉందో అర్థం చేసుకోవచ్చు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సాధారణంగా ఏ సినిమా అయినా సరే థియేటర్లలో విడుదలైన ఎనిమిది వారాల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ కి సిద్ధమవుతుంది. అయితే ఇప్పుడు దేవర డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు సమాచారం.  ఇకపోతే ఈ సినిమా ఇప్పుడు హిట్ టాక్ తో ప్రారంభం అయింది కాబట్టి ఈ గడువు కాస్త ఇంకా పెరిగేటట్టు కనిపిస్తోంది. దీపావళి తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్ కి  వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ పరిస్థితులు మారేటట్టు కనిపిస్తున్నాయి. 


ముఖ్యంగా క్రిస్మస్ కి ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.  మొత్తానికైతే దేవర  సినిమా ఇప్పుడు థియేటర్లలో అలరించి , క్రిస్మస్ కి ఓటీటీ లో అలరించబోతోందని చెప్పవచ్చు. మొత్తానికైతే డిజిటల్ స్ట్రీమింగ్ నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం కానుంది అని తెలిసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


 దేవర సినిమా విషయానికి వస్తే.. ప్రీ రిలీజ్ లో రూ .180 కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ జరుపుకున్న ఈ సినిమా ఇప్పుడు రూ.350 కోట్ల టార్గెట్ తో  బరిలోకి దిగింది. ఇక  తాజాగా జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే ఈ సినిమా రూ.500 కోట్లు సులభంగా రాబడుతుంది అంటూ అభిమానులు అంచనాలు వేస్తున్నారు. 


మరొకవైపు ఎన్టీఆర్ ఈ సినిమాతో సోలోగా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు అని చెప్పవచ్చు. మరి ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ఎన్టీఆర్ కు  ఎలాంటి సక్సెస్ అందిస్తుందో చూడాలి. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.


Also Read: Sobhita Chaitanya: నాకు నాగచైతన్యతో పిల్లలు కనాలని ఉంది: శోభిత ధూళిపాల


Also Read: KTR Comments on Devara: దేవర ఈవెంట్ రద్దుపై కేటీఆర్ సంచలన కామెంట్స్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.