Devara Movie Tickets: తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న దేవర మూవీ సెప్టెంబర్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర చిత్రానికి సంబంధించి టికెట్ అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే నిన్న అనగా సోమవారం సాయంత్రం నుంచి టికెట్ బుకింగ్స్ జరుగుతున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దీనికి తోడు రెండు తెలుగు రాష్ట్రాలలో అదనపు షోలకు రెండు ప్రభుత్వాల నుంచి అనుమతి లభించింది.  టికెట్ ధర కూడా పెరిగిందనే చెప్పాలి. ఆంధ్ర ప్రదేశ్,  తెలంగాణలో మొదటి రోజు టికెట్ ధరను వంద రూపాయలు అధికం చేశారు. అయినా సరే అభిమానులు టికెట్ ధర పెరిగినా.. టికెట్స్ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా పెరుగుతున్న రద్దీ కారణంగానే అదనపు షోల కోసం ప్రభుత్వాల నుంచి అనుమతులు కోరగా.. రెండు ప్రభుత్వాలు ప్రత్యేక షో లు నిర్వహించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 


ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో మొదటి రెండు రోజులకు అదనపు షోలు మరియు టికెట్ ధరలను పెంచడానికి దేవరకు అనుమతి లభించింది. దేవర 29 థియేటర్లలో వంద రూపాయల టికెట్ ధర పెంపుతో అలాగే తెలంగాణలోని థియేటర్లలో ఆరు షోలు 100 రూపాయల పెంపుతో సెప్టెంబర్ 28 నుండి ప్రారంభమయ్యే తదుపరి 9 రోజులపాటు సింగిల్ థియేటర్లకు 25 మల్టీప్లెక్స్ లకు 50 రూపాయల పెంపుతో సినిమా రెగ్యులర్ 5 షోలను నిర్వహించవచ్చు అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. 


దీన్నిబట్టి చూస్తే ఆంధ్రప్రదేశ్లో మల్టీప్లెక్స్ టికెట్ ధర రూ.135 ఉంటుందని, ప్రభుత్వం నోటీస్ జారీ చేయగా సింగిల్ స్క్రీన్ థియేటర్లకు ఆ తర్వాత పై తరగతి టికెట్ ధర రూ. 110 లోయర్ క్లాస్ టికెట్ ధర 60 రూపాయల చొప్పున సెప్టెంబర్ 27వ తేదీన విడుదలైన అర్ధరాత్రి 12 గంటలకు ప్రారంభమయ్యే మొదటి ఆరు షో లకు వర్తిస్తాయని చెప్పవచ్చు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ తొలిసారి నటిస్తోంది. అంతేకాదు సైఫ్ అలీఖాన్ కూడా విలన్ గా నటిస్తున్నట్లు సమాచారం.


Read  more: Viral news: వామ్మో.. నిద్రపోయి ఏకంగా 9 లక్షలు గెల్చుకుంది.. స్టోరీ తెలిస్తే మాత్రం మైండ్ బ్లాక్ అయిపోద్ది..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.