Devara Trailer: దేవర ట్రైలర్.. నటనతో జూ ఎన్టీఆర్ ఊచకోత.. జాన్వీ అందాల ఆరబోత
Jr NTR Devara Trailer Released: మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా పార్ట్ 1 ట్రైలర్ విడుదలవగా.. ఎన్టీఆర్ నట విశ్వరూపంతో అభిమానులు పూనకాల్లో మునిగారు.
Jr NTR Devara Trailer: యావత్ సినీ ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా ట్రైలర్ విడుదలైంది. గతంలో ఎప్పుడూ కనిపించని పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ నట విశ్వరూపం చూపగా.. జాన్వీ కపూర్ అందంతో కట్టిపడేసింది. సముద్రపు నేపథ్యంలో ఉన్న కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో ప్రేక్షకులకు గూస్‌బంప్స్ వచ్చేశాయి. యంగ్ టైగర్ ఖాతాలో మరో పాన్ వరల్డ్ స్థాయిలో భారీ హిట్ పక్కా అన్నట్టు ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది.
Also Read: Devara Trailer Updates: జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు క్రేజీ అప్‌డేట్.. దేవర కోసం పుష్పరాజ్ ఆగమనం..!
'అసలు ఎవరు వారంతా' అంటూ ట్రైలర్ ప్రారంభమైంది. 'కులం లేదు.. మతం లేదు. భయం అసలే లేదు. ధైర్యం తప్ప ఏమీ తెలియని కళ్లల్లో మొదటిసారి భయం పొరలు కమ్ముకుంది' అంటూ ప్రకాశ్ రాజ్ వాయిస్ ఓవర్‌తో ట్రైలర్ కొనసాగింది. 'శానా పెద్ద కథ సామి. రక్తంతో సంద్రమే ఎరుపెక్కిన కథ.. మా దేవర కథ' అని చెప్పాడు. 'మనిషికి బతికేంత ధైర్యం చాలు. చంపేంత ధైర్యం కాదు. కాదు కూడదని మళ్లీ మీరు ఆ ధైర్యాన్ని కూడగడితే ఆ ధైర్యాన్ని చంపే భయాన్నవుతా' అంటూ ఎన్టీఆర్ తొలి డైలాగ్ పలికాడు.
ట్రైలర్‌ను చూస్తుంటే ఎన్టీఆర్ డ్యుయల్ రోల్‌లో ఉన్నట్టు కనపిస్తోంది. అసలైన దేవర ధైర్య సాహసాలు కలిగిన వ్యక్తి. దేవర కుమారుడు భయస్తుడు.. పిరికివాడుగా ఎన్టీఆర్ కనిపించాడు. ధైర్యం.. పిరికివాడు రెండు పాత్రల్లో ఎన్టీఆర్ మెరిశాడు. సంద్రం ఒడ్డున నివసిస్తున్న ఓ జాతిని కాపాడేందుకు పోరాడే యోధుడుగా దేవర ఉన్నట్టు ట్రైలర్‌ను బట్టి కనిపిస్తోంది. కొన్ని సెకన్లు కనిపించిన జాన్వీ కపూర్ అందంగా కనిపించింది. సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు హైలెట్‌గా నిలిచేట్టు ఉంది.
ఇప్పటికే టీజర్‌తో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచేసిన చిత్ర బృందం తాజాగా ట్రైలర్‌తో సినిమాపై మరింత అంచనాలు పెంచేయడంతో ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్, ప్రకాశ్ రాజ్, శ్రీకాంత్, షైనీ టామ్ చాకో, నరైన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈనెల 27వ తేదీన ప్రపంచవ్యాప్తంగా దేవర సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. అయితే ఇప్పటి నుంచే సినిమా టికెట్లు రిజర్వ్ అయి రికార్డులు నెలకొల్పుతున్నది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter