Devi Movie: పాము ఇతివృత్తంగా పలు సినిమాలు వచ్చాయి. సినిమాల్లో గ్రాఫిక్స్‌లో పామును వినియోగించినా కొన్ని సీన్లలో మాత్రం అసలు పాము అవసరమవుతుంది. ఈ సందర్భంగా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుని షూటింగ్‌ చేస్తుంటారు. అయితే ఒక సినిమా షూటింగ్‌ సమయంలో పాము కాటువేసింది. ఆ పాము కాటుతో ఒకరు మరణించారు కూడా. ఈ విషయాన్ని సినిమా హీరోయిన్‌ స్వయంగా చెప్పారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Allari Naresh: 'ఆంటీ అయితే.. ఎవరైతే ఏంటి కావాల్సింది పెళ్లి: 'ఆ ఒక్కటీ అడక్కు' టీజర్‌


తెలుగు సినీ పరిశ్రమలో 'దేవి' సినిమా నేటికి విడుదలై 25 వసంతాలు పూర్తయ్యాయి. కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రేమ కీలక పాత్ర పోషించారు. వనిత, షిజు, అబు సలీం, భానుచందర్‌ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సోషియో ఫాంటసీ చిత్రం 12 మార్చి 1999న విడుదలైంది. పాతిక ఏళ్లు పూర్తయిన సందర్భంగా హీరోయిన్‌ ప్రేమ 'దేవి' సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ సమయంలో ఏర్పడిన అనుభవాలు, సంఘటనలను తెలిపారు. చిత్రీకరణ సమయంలో పాము ఒకరి ప్రాణం తీసిందని గుర్తు చేసుకున్నారు.

Also Read: Sai Dharam Tej: సాయిధరమ్‌ తేజ్‌ సంచలనం.. తల్లి పేరు చేర్చుకుని 'సాయి దుర్గ తేజ్‌' పునః నామకరణం


'చిత్ర బృందమంతా రాత్రింబవళ్లు కష్టపడి పని చేశాం. సినిమాలో ఉన్నట్టే చిత్రీకరణ సమయంలో ఓ వ్యక్తిని పాము కాటేసింది. షూటింగ్‌ సమయంలో పాము కాటేసిన వ్యక్తిని కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించాం. ఆస్పత్రికి తీసుకెళ్లినా కూడా బతికించుకోలేకపోయాం' అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ఘటనతో షూటింగ్‌ రెండు రోజులు వాయిదా వేసినట్లు వెల్లడించారు. 'ఇలా చాలా కష్టాలు పడి తీసిన సినిమా విడుదలైన అనంతరం సూపర్‌ హిట్‌గా నిలిచింది. అద్భుత ప్రతిఫలం దక్కడంతో ఆ కష్టాలన్నీ మరచిపోయాం' అని తెలిపారు.

'నా కెరీర్‌లోనే 'దేవి' సినిమా ప్రత్యేకం. మరచిపోలేని జ్ఞాపకం' అని ప్రేమ వెల్లడించారు. సినిమాల అనంతరం 2006లో ఓ పారిశ్రామికవేత్తను వివాహం చేసుకున్న ప్రేమ 2016లో విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నారు. తెలంగాణ నేపథ్యంలో తీస్తున్న 'రజాకార్‌' సినిమాలో ప్రేమ మళ్లీ వెండితెరపై కనిపిస్తున్నారు. మంచి కథలు వస్తే సినిమాలు చేయాలని ఆమె భావిస్తున్నారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి