Dhanush Silent Craze: ధనుష్ కి తెలుగులో ఏమన్నా క్రేజ్ ఉందా..అన్ని షోస్ హౌస్ ఫుల్లే!
Dhanush got Warm Welcome: చేసిన మొదటి స్ట్రైట్ సినిమాతోనే ధనుష్ కు తెలుగులో మంచి రెస్పాన్స్ దక్కుతోంది అని అంటున్నారు, వేసిన స్పెషల్ ప్రీమియర్ షోస్ అన్నీ ఫుల్ అయ్యాయని అంటున్నారు.
Dhanush got Warm Welcome in Telugu: సాధారణంగా తమిళ హీరోలకి తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంటుంది, గతంలో మనం చూసినట్లయితే రజినీకాంత్, కమల్ హాసన్, అజిత్, విజయ్ సహా విశాల్ వంటి హీరోలకి తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. వారి సినిమాలను తెలుగులో కూడా రిలీజ్ చేస్తూ వస్తున్నారు మేకర్స్. రజనీకాంత్ మాజీ అల్లుడు ధనుష్ చేస్తున్న కొన్ని సినిమాలను కూడా తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. కానీ ఆయన చేసిన మొట్టమొదటి ద్విభాషా చిత్రం ఈ రోజు విడుదలవుతోంది.
అయితే ఆసక్తికరంగా సినిమా మీద ఉన్న నమ్మకంతో సినిమా యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన స్పెషల్ ప్రీమియర్ షోలని హైదరాబాదులోని కొన్ని థియేటర్ల తో పాటు తెలుగు రాష్ట్రాలలోని ఇతర థియేటర్లలో కూడా ప్రదర్శించారు. సాధారణంగా హైదరాబాద్ లో మొట్టమొదటి షో ప్రసాద్ ఐమాక్స్ థియేటర్ లోనే పడుతుంది. నిన్న కూడా మొట్టమొదటి షో ప్రసాద్ ఐమాక్స్ లోనే వేసేలాగా చర్యలు తీసుకున్నారు. 8.15కి రెండు షోలు వేయగా ఎనిమిదిన్నరకి ఒక షో వేశారు.
తర్వాత 11. 15 కి మరొక షో కూడా యాడ్ చేశారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ప్రసాద్ ఐమాక్స్ సహా హైదరాబాద్ లో వేసిన మొత్తం 14 షోలు థియేటర్లు హౌస్ ఫుల్ అయ్యాయి. అదే విధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైతే సినిమా రిలీజ్ చేస్తున్నారో, ఆయా ప్రాంతాల్లో కూడా సినిమాకి హౌస్ ఫుల్ అవడం ఆసక్తికరంగా మారింది. నిర్మాతలు ఒక తమిళ హీరో మొదటి తెలుగు సినిమాకి ఇంత రెస్పాన్స్ అయితే ఊహించలేదని అంటున్నారు.
పాజిటివ్ మౌత్ టాక్ కోసం ఒకరోజు ముందుగానే థియేటర్లలో విడుదల చేయడం ఇప్పుడు తమకు బాగా కలిసి వచ్చిందని నిర్మాతలు భావిస్తున్నారు. ఇక సినిమా చూసిన విమర్శకులు, విశ్లేషకులు సైతం సినిమా బాగుందంటూ ప్రశంసల వర్షం కురిపిస్తూ ఉండడంతో కచ్చితంగా ఈ సినిమా కలెక్షన్లు కూడా అదిరిపోతాయని నిర్మాతలు లెక్కలు వేసుకుంటున్నారు.
ఇక ధనుష్ అభిమానులు కూడా తమ హీరోకి తెలుగులో మంచి ఆదరణ లభిస్తోందని, మొట్టమొదటి ద్విభాషా చిత్రం తెలుగులో చేసినా స్ట్రైట్ సినిమాగా ఆయనకు మంచి పేరు తీసుకొస్తుందని ఆనంద పడుతున్నారు. ఇక వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్ హీరోగా ఈ సినిమా తెరకెక్కింది. తమిళంలో వాతి తెలుగులో సార్ పేరుతో ఈ సినిమాని రిలీజ్ చేశారు. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో సముద్రఖని విలన్ పాత్రలో నటించారు. ఇతర కీలక పాత్రలలో తనికెళ్ల భరణి, సాయి కుమార్ సహా మరికొందరు తమిళ నటులు నటించారు.
Also Read: Swara Bhaskar Marriage: సీక్రెట్‌గా పెళ్లిచేసుకున్న వివాదాస్పద హీరోయిన్.. ఏకంగా పొలిటికల్ లీడర్‌తో!
Also Read: Sir Movie Review: ధనుష్ పాస్ అయ్యాడా? 'సార్' రివ్యూ అండ్ రేటింగ్ మీకోసం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook