Dhanush, Sekhar Kammula film: ధనుష్, శేఖర్ కమ్ముల కాంబోలో తెలుగు, తమిళం, హిందీలో సినిమా
Dhanush, Sekhar Kammula trilingual film: శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతోంది. ఇటీవల మీడియాలో వినిపించిన టాక్ నిజమని నిరూపిస్తూ శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ అధినేత పి రామ్మోహన్ రావు ఇవాళ ట్విటర్ ద్వారా ఓ ప్రకటన చేశారు.
Dhanush, Sekhar Kammula trilingual film: శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతోంది. ఇటీవల మీడియాలో వినిపించిన టాక్ నిజమని నిరూపిస్తూ శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ అధినేత పి రామ్మోహన్ రావు ఇవాళ ట్విటర్ ద్వారా ఓ ప్రకటన చేశారు. తమిళ, తెలుగు, హిందీ ఆడియెన్స్‌కి సుపరిచితుడైన ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సినిమా తెరకెక్కబోతున్నట్టు రామ్మోహన్ రావు ట్విటర్ ద్వారా వెల్లడించాడు. ఈ సినిమాకు ఉన్న మరో విశేషం ఏంటంటే.. ఏకకాలంలో తమిళ, తెలుగు, హిందీ భాషల్లో సినిమాను షూట్ చేయనున్నారు.
రాంజనా సినిమాతో హిందీ ఆడియెన్స్‌కి చేరువైన ధనుష్ ప్రస్తుతం హిందీలో అత్రంగి రే అనే సినిమాలోనూ నటించాడు. మార్చి చివర్లో అత్రంగీ రే షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం ఈ సినిమా విడుదల కోసం వేచిచూస్తున్నాడు. అలాగే తమిళంలో జగమే తందిరం (Jagame Thandhiram) అనే సినిమాలోనూ నటించాడు. ఇది కూడా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతోంది.
లాక్ డౌన్ సమయం (Tamil Nadu lockdown) కావడంతో ఓటిటిలో రిలీజ్ అవుతున్న ఈ సినిమాను మేకర్స్ పెద్ద ఎత్తునే ప్రమోట్ చేసుకుంటున్నారు. తమిళ, హిందీ చిత్రాల సంగతి కాసేపు పక్కనపెడితే.. ధనుష్ ది గ్రే మ్యాన్ (The Gray Man) అనే హాలీవుడ్ సినిమాలోనూ నటిస్తున్నాడు.
ఇక శేఖర్ కమ్ముల (Sekhar Kammula) విషయానికొస్తే.. నాగచైతన్య, సాయి పల్లవి జంటగా తెరకెక్కిన లవ్ స్టోరీ సినిమాను త్వరలోనే ఆడియెన్స్ ముందుకు తీసుకొచ్చే పనుల్లో శేఖర్ కమ్ముల బిజీగా ఉన్నాడు. కరోనా కారణంగా థియేటర్లు మూతపడటంతో లవ్ స్టోరీ సినిమాను విడుదల (Love story movie release date) చేసేందుకు సరైన సమయం కోసం వేచిచూస్తున్నారు.
శేఖర్ కమ్ముల, ధనుష్ కాంబోలో (Sekhar Kammula, Dhanush combo) తెరకెక్కనున్న సినిమా ఈ ఏడాది చివర్లో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఏషియన్ సినిమాస్‌కి చెందిన నారాయణ దాస్ నారంగ్ ఈ సినిమాను ప్రజెంట్ చేస్తుండగా పి రామ్మోహన్ రావు నిర్మించనున్నాడు.