Kubera Update : కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఇప్పుడు ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తో కలిసి ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కుబేర అనే ఆసక్తికరమైన టైటిల్ తో ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకి సంబంధించిన ప్రతి అప్డేట్.. సోషల్ మీడియా లో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా ఈ సినిమాలో ధనుష్ పాత్రకి  సంబంధించిన ఒక షాకింగ్ అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హీరో పాత్ర ఉన్న భాదను తెలియజేయడానికి.. సినిమాకి సంబంధించిన ఒక ముఖ్యమైన సన్నివేశాన్ని.. ఒక చెత్తకుప్ప దగ్గర చిత్రీకరించాల్సి వచ్చింది. 


ఒక స్టార్ హీరో అయ్యిఉండి కూడా ధనుష్ ఎలాంటి సంకోచంలేకుండా.. ఆ సీన్ ని చేయడానికి వెంటనే ఒప్పుకున్నారట. సినిమాలో ఈ సన్నివేశం చాలా ఎమోషనల్ గా ఉంటుందని తెలుస్తోంది. కేవలం ఈ ఒక్క సన్నివేశం షూటింగ్ దాదాపు 12 గంటలు దాకా జరిగిందట.  కానీ ఆ 12 గంటలు ధనుష్ ముసుగు కూడా ధరించకుండా ఆ దుర్వాసన భరిస్తూనే ఆ చెత్తకుప్ప దగ్గర షూటింగ్ పూర్తి చేశారట. ధనుష్ డెడికేషన్ చూసి అక్కడున్న చిత్ర బృందం కూడా షాక్ అయిందట. ఈ విషయం తెలిసిన అభిమానులు కూడా.. ధనుష్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 


డైరెక్టర్ శేఖర్ కమ్ముల తన సినిమాలని చాలా వరకు రియలిస్టిక్ గా ఉంచడానికి ప్రయత్నిస్తారు. ఈ సినిమా కూడా అలాగే ఉండబోతుందని అర్థమవుతోంది. ఈ సినిమాలో ధనుష్ ఇంతకుముందు ఎప్పుడూ కనిపించనటువంటి ఒక ఆసక్తికరమైన పాత్రలో కనిపించబోతున్నారు. నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఈ సినిమాలో ధనుష్ తో హీరోయిన్ గా నటిస్తోంది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. మంచి అంచనాల మధ్య ఈ ఏడాది ఈ సినిమా విడుదలకి సిద్ధం అవుతుంది. కానీ రిలీజ్ డేట్ కి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడాల్సి ఉంది.


Also read: Apple Watch Saves Life: ప్రాణాలు కాపాడిన యాపిల్ వాచ్.. సీఈవో రెస్పాన్స్ ఏంటో తెలుసా..?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter