Dhanush sings Hathavidi for Miss Shetty Mr Polishetty: ఒకపక్క హీరోలుగా నటిస్తూనే మరోపక్క నిర్మాతలుగా కూడా మారుతున్నారు మన హీరోలు. ఇప్పటికీ ఈ కోవలో చాలామంది హీరోలు పయనిస్తూ ఉండగా ఈ మధ్య హీరోలు కొత్త ట్రెండు కూడా మొదలుపెట్టారు. అదేంటంటే మనోళ్లు సింగర్లుగా కూడా మారుతున్నారు. ఇప్పటికే తెలుగులో ఎన్టీఆర్ తమిళంలో ధనుష్, సింబు లాంటి వాళ్ళు కొన్ని కొన్ని పాటలు పాడుతూ ఆసక్తి రేకెత్తించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఇప్పుడు ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ధనుష్ ఒక స్టార్ హీరోయిన్ కోసం సింగర్ గా అవతారం ఎత్తారు. నమ్మలేకపోతున్నారు కదా, అయితే మీరు విన్నది నిజమే. తమిళ సూపర్ స్టార్ ధనుష్ తెలుగులో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ మధ్యన ఆయన సార్ అనే ఒక తమిళ తెలుగు సినిమాలో కనిపించి అందరిని ఆకట్టుకున్నాడు. ఈ సినిమాకి సంబంధించి కొన్ని పాటలు కూడా ఆయన పాడగా అవన్నీ కూడా బాగా హిట్ అయ్యాయి.


Also Read: Thaman: మహేష్-త్రివిక్రమ్ సినిమా నుంచి ధమన్ ఔట్.. అసలు ఏమైందంటే?


ఇప్పుడు ఆయన మరో తెలుగు సినిమా కోసం పాట పాడుతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది. ఆ సినిమా మరేమిటో కాదు మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. ఈ సినిమాలో నవీన్ పోలిశెట్టి అనుష్క శెట్టి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం ధనుష్ తన గాత్ర దానం చేశాడు. హతవిధీ ఏందిది అనే సాంగ్ ఒక దాన్ని పాడుతున్నట్టుగా అధికారిక ప్రకటన అయితే వెలువడింది. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ సాంగ్ కి రాధన్ సంగీతం అందించారు.


ఈ సాంగ్ మే 31వ తేదీన అందుబాటులోకి రాబోతున్నట్లుగా అధికారిక ప్రకటన చేసింది. ఈ సినిమాను ఒక కామెడీ ఎంటర్టైనర్ గా యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో సందీప్ కిషన్ తో ఒక సినిమా చేసిన డైరెక్టర్ మహేష్ బాబు ఈ సినిమాతో చాలా కాలం తర్వాత ప్రేక్షకులు ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఇక అనుష్క కోసం ధనుష్ సాంగ్ పాడిన వ్యవహారం మాత్రం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది. చూడాలి ఈ పాట ఎలా ఉండబోతోంది అనేది.
Also Read: Malli Pelli: భారీ బడ్జెట్ తో మళ్లీ పెళ్లి.. పెద్ద దెబ్బే పడిందే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK