Dhanush Sir Movie: సార్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఆరోజునే ప్రేక్షకుల ముందుకు ధనుష్ సినిమా!
Dhanush Sir Movie to Release on December 2nd: ధనుష్ హీరోగా నటిస్తున్న సర్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా విడుదలైంది.
Dhanush Sir Movie to Release on December 2nd: ఈ మధ్యకాలంలో హీరోలకు దర్శకులకు భాషా పరిమితులు లేకుండా పోతున్నాయి. తమిళ దర్శకులతో తెలుగు హీరోలు, తెలుగు హీరోలతో తమిళ దర్శకులు ఇలా పలు ఆసక్తికరమైన కాంబినేషన్లు సెట్ అవుతున్నాయి. అలా మన తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి డైరెక్షన్లో ధనుష్ హీరోగా వాతి అనే తమిళ సినిమా రూపొందుతోంది. దాన్ని ఏకకాలంలో తెలుగులో కూడా రూపొందిస్తున్నారు తెలుగులో సార్ పేరుతో రిలీజ్ చేస్తున్నారు.
పలు సూపర్ హిట్ సినిమాలకు నిర్మాణం వహించిన సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ఈ సినిమాను ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ అంటే త్రివిక్రమ్ భార్య సౌజన్యతో కలిసి నిర్మిస్తున్నారు. శ్రీకర ఫిలింస్ సంస్థ ఈ సినిమాను సమర్పిస్తోంది. ఈ సినిమాలో ధనుష్ సరసన హీరోయిన్ గా భీమ్లా నాయక్ ఫేమ్ సంయుక్త మీనన్ నటిస్తోంది. ఇక ఈ సినిమాలో ధనుష్ ఒక లెక్చరర్ పాత్రలో కనిపిస్తున్నట్లు గతంలో క్లారిటీ వచ్చింది. ఇప్పుడు రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ విడుదల చేసిన పోస్టర్ తో మరింత క్లారిటీ వచ్చినట్టు అయింది.
ఈ సినిమాని డిసెంబర్ రెండో తేదీన విడుదల చేస్తున్నట్లు సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇక రిలీజ్ పోస్టర్లో ధనుష్ క్లాస్ రూమ్ లో గణితానికి సంబంధించిన సబ్జెక్టు బోధిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇక ఈ సినిమా పూర్తిస్థాయి ఎడ్యుకేషనల్ బ్యాక్ డ్రాప్ లో సాగబోతుందని, విద్యావ్యవస్థలో ఉన్న కొన్ని సమస్యలను ఎత్తి చూపే విధంగా ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. గతంలో చాలామంది హీరోలు ఇదే బ్యాక్ డ్రాప్ లో సినిమాలు చేసి సూపర్ హిట్ లు అందుకున్నారు.
మరి ధనుష్ కూడా ఈ సినిమాతో సూపర్ హిట్ అందుకుంటాడా? లేదా? అనేది చూడాల్సి ఉంది. ధనుష్ ఇటీవల పలు ఆసక్తికరమైన సినిమాలను లైన్లో పెడుతున్న సంగతి తెలిసిందే. నిత్యమీనన్ తో కలిసి ఆయన చేసిన తిరు సినిమా తెలుగులో కూడా సూపర్ హిట్ అయింది. తమిళనాడులో విడుదలై 30 రోజులు గడుస్తున్నా ఇంకా హౌస్ ఫుల్ షోస్ తో సినిమా నడుస్తుందని టాక్ వినిపిస్తోంది. ఇక సార్ సినిమా కూడా సూపర్ హిట్ అవుతుందని ధనుష్ ఫాన్స్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు, చూడాలి మరి భవిష్యత్తులో ఏం జరగబోతుంది అనేది.
Also Read: Tollywood Movies Releasing: ఈ వారం థియేటర్లలో, ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాల లిస్టు ఇదే!
Also Read: Varun Tej 13: ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ గా వరుణ్ తేజ్.. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా మూవీ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి