కొలవరీ ఢీ పాటతో యూత్‌లో మంచి క్రేజ్‌ను సంపాదించుకున్న హీరో ధనుష్‌. రజనీకాంత్ అల్లుడిగా కాకుండా.. తన నటనతో తమిళ, తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ధనుష్... రాంజానా చిత్రంతో బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు. ఇప్పుడు ఆయన హాలీవుడ్‌లో కూడా తన లక్ పరీక్షించుకోనున్నారు. ధనుష్‌ నటిస్తున్న తొలి హాలీవుడ్‌ సినిమా ‘ది ఎక్స్‌ట్రార్డినరీ జర్నీ ఆఫ్‌ ఫకీర్‌’కు సంబంధించిన టీజర్ ఇటీవలే విడుదలైంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఓ ట్రావలాగ్‌ను పోలి ఉన్న ఈ చిత్రంలో బర్ఖద్‌ అబ్ది, ఎరిన్‌ మోరియార్టీ, అబెల్‌ జాఫ్రీ మొదలైన విదేశీ నటులు నటిస్తున్నారు. కెన్‌ స్కాట్‌ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. రొమేన్ ప్యుర్‌టోలస్ రచించిన ‘ది ఎక్స్‌ట్రార్డినరీ జర్నీ ఆఫ్‌ ఫకీర్ హు గాట్ ట్రాప్డ్ ఇన్ ఏ ఇకియా వార్డ్రోబ్‌’ అనే నవల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కనుంది.  దీనిని ఓ ఫ్రెంచి కామెడీ అడ్వెంచర్ ఫిల్మ్‌‌గా దర్శకులు పేర్కొన్నారు. పూర్తిస్థాయి హాస్యకథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ధనుష్ దేశదిమ్మరిగా.. విదేశాలు తిరిగే యాత్రికుడిగా నటించారు. సోనీ పిక్చర్స్ ఈ చిత్రం పంపిణీ హక్కులను దక్కించుకుంది.