కన్నడలో కన్నడ నటుడు యశ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన కేజీఎఫ్ సినిమాను మేకర్స్ తెలుగు, తమిళం, మళయాళం, హిందీ వెర్షన్స్‌లోనూ విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. నాలుగైదు భాషల్లో విడుదల కానున్న ఈ సినిమా కోసం నిర్మాతలు నాలుగు భాషల్లో ప్రమోషన్స్ చేసుకుంటున్నారు. అందులో భాగంగానే ఇటీవల సలాం రాకీ భాయ్ అనే లిరికల్ సాంగ్‌ను విడుదల చేసిన మేకర్స్ తాజాగా ధీర ధీర అనే మరో పాటను ఆడియెన్స్ ముందుకు తీసుకొచ్చారు. అంతకన్నా ముందుగా నవంబర్‌ 9న రిలీజైన కేజీఎఫ్ తెలుగు మూవీ ట్రైలర్‌కి భారీ స్పందన లభించగా ఆ తర్వాత విడుదలైన సలాం రాకీ భాయ్, మిల్కీ బ్యూటీ తమన్నా చేసిన దోచెయ్ ఐటం సాంగ్ ఈ సినిమా పాటలకు సైతం మంచి స్పందనే కనిపిస్తోంది. ప్రశాంత్ నీల్ అనే దర్శకుడు తెరకెక్కించిన ఈ సినిమాను తెలుగులో ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణ సమర్పించగా, వారాహి చలన చిత్రం బ్యానర్ తెలుగు ఆడియెన్స్ ముందుకు తీసుకొస్తుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


కోలార్ గోల్ ఫీల్డ్స్ అనే ట్యాగ్ లైన్‌తో తెరకెక్కిన కేజీఎఫ్ సినిమా నేపథ్యం విషయానికొస్తే, 1951లో ముంబై వీధుల్లో పుట్టిన రాకీ అనే కుర్రాడు నేరాలు చేస్తూ పెరిగి పెద్దవుతాడు. ఆ తర్వాత తన పనిలో భాగంగా ఓసారి కోలార్ గోల్డ్ ఫీల్డ్స్‌కి వెళ్తాడు. అక్కడ అతడికి ఎదురైన అనుభవాలు, సవాళ్లు.. అంతకన్నా ముందుగా చిన్నప్పటి నుంచి అతడు నేర్చుకున్న గుణపాఠాల ఆధారంగా ఆ సమస్యలను ఎదుర్కున్న యుద్ధమే ఈ కేజీఎఫ్ సినిమా కథాంశం. ఈ సినిమాలో రాకీ పాత్రలో యశ్ నటించగా అతడి సరసన శ్రీనిధి జంటగా నటించింది. మిల్కీ బ్యూటీ తమన్నా ఐటం సాంగ్ చేసింది. తమన్నా చేసిన ఐటం సాంగ్ సైతం ఇంటర్నెట్‌లో ట్రెండ్ అవుతోంది.