Acharya Movie : అసలు ఆచార్య కొరటాలకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారా లేదా... మెగాస్టార్, మెగా పవర్ స్టార్‌ల మల్టీస్టారర్ చిత్రం ఆచార్య ఇవాళే విడుదలైంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీకి మిక్స్‌డ్‌ టాక్ వస్తోంది. కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్ సంస్థలు దాదాపు 140కోట్లు రూపాయల బడ్జెట్‌తో సంయుక్తంగా ఆచార్య చిత్రాన్ని నిర్మించాయి. 2019 అక్టోబర్‌లో ప్రారంభమైన ఆచార్య చిత్రం షూటింగ్ జనవరి 2020లో ప్రారంభమైంది. కొవిడ్ మహమ్మరి విజృంభణతో విడుదల ఆలస్యమై చివరకు ఇవాళ 29న రిలీజైంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సిద్ధవనం అడవిలో పాదఘట్టం అనే చిన్న మారుమూల తండాలో నిర్మించిన చిన్న అగ్రహారం ధర్మస్థలి. ఈ ధర్మస్థలిలోనే గట్టమ్మ ఆలయం కొలువుదీరింది. ధర్మం కోసం ప్రాణాలిచ్చే పవిత్ర జనంతో ధర్మస్థలి నిత్యం అలరారుతూ ఉంటుంది. గట్టమ్మ తల్లి కొలువైన ఆ ఆలయాన్ని మింగేయాలని, ఊరే లేకుండా చేసి ఆ ప్రాంతంలో మైనింగ్ చేపట్టాలని రాథోడ్ కంపెనీ ప్లాన్ చేస్తుంది. అందు కోసం ధర్మస్థలిలో ఉన్న కలుపు మొక్క బసవను ఉసిగొల్పుతుంది. ధర్మస్థలిలో అధర్మం ఎలా మొదలైంది.. ఎవరు కారణమయ్యారు.. అధర్మ స్థలిగా మారిన ఆ స్థలాన్ని, ఆ ఊరిని బసవ నుంచి ఎవరు కాపాడుతూ వచ్చారు.. బసవ అరాచకాలతో ఊరి జనం చింతిస్తున్న సమయంలో... తిరిగి ధర్మస్థలిలో ధర్మం ఎలా నిలబడింది. ఆచార్య ధర్మస్థలికి వచ్చి  ధర్మంకోసం ఏం చేశాడు అనేది మిగతా కథ.


కథలో హీరోయిజం ఎలివేట్ చేయటానికి కావల్సినన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. అందునా ఇద్దరు హీరోలు. ఇటు మెగాస్టార్, అటు మెగా వపర్ స్టార్. చిరంజీవి, రామ్ చరణ్ ఒకేసారి వెండితెరపై కనిపిస్తారంటే మెగా అభిమానులకు ఇంకేం కావాలి? అందునా ప్రేక్షకులు చిరంజీవిని తెరపై చూసి చాలా కాలం అయింది. మెగాస్టార్ సినిమా అంటే అన్ని ఎలిమెంట్స్ కూర్చి ఉంటుందనేది ప్రేక్షకులు బలంగా నమ్ముతారు. రామ్ చరణ్‌ కూడా తోడవటం అదనపు ఆకర్షణగా నిలుస్తుందనే అంచనాలు నెలకొన్నాయి.


ఇంతటి భారీ అంచనాలున్నాయి కాబట్టే ఈ సినిమా కథ పలుమార్లు మార్చుకున్నారు దర్శకుడు కొరటాల శివ. కథలో ముందుగా చిరు సరసన హిరోయిన్‌గా కాజల్‌ను తీసుకున్నారు. కొన్ని రోజులు కాజల్‌తో షూటింగ్ కూడా జరిగింది. కానీ చివరికి కాజల్‌ పాత్రను తొలగించారు. ఇదే సందర్భంలో చిరంజీవి నటించిన ఆచార్య పాత్ర, రామ్‌చరణ్‌ సిద్ధ పాత్రల్లో కూడా భారీ మార్పులు చేశారు. ఆ మార్పులే కొంప ముంచాయనే టాక్ సామాన్య ప్రేక్షకుల నుంచే కాకుండా మెగా అభిమానుల నుంచి కూడా వ్యక్తమవుతోంది.


ఏ సినిమాకైనా కథ, కథనం పరంగా దర్శకుడిదే తుది నిర్ణయం. డైరెక్టర్ ఏది చూపించాలని అనుకుంటే అదే ఫైనల్. అలా దర్శకులు అనుకున్నట్లు తెరకెక్కిన చిత్రాల సక్సెస్ రేటు అత్యధికం. అయితే ఆచార్య కథలో మార్పులు కొరటాల శివ సొంతంగా చేసినవా.. లేక హీరోల ప్రభావం ఉందా అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. కథలో మార్పులు చేసే సమయంలో ఆచార్య జోక్యం అధికమవటం వల్లనే ఫైనల్ రిజల్ట్ తేడా కొట్టిందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొరటాలకు పూర్తి స్వేచ్ఛ లభించనందునే ఆచార్యకు ప్రేక్షక విద్యార్థుల నుంచి తక్కువ మార్కులు వచ్చాయని టాక్ వినిపిస్తోంది. ఇప్పుడంతా... సానా కష్టం అయిపాయే ఆచార్యకి అని సెటైరికల్ సాంగేసుకుంటున్నారు.


Also Read : KTR on Andhra Pradesh : పక్క రాష్ట్రంలో పరిస్థితి అద్వాన్నం.. ఏపీపై మంత్రి కేటీఆర్ పరోక్ష కామెంట్స్...


Also Read : Komatireddy Venkat Reddy: మా అడ్డాలోకి వేరే నేత అక్కర్లేదు.. రేవంత్ నల్గొండ టూర్‌పై కోమటిరెడ్డి సంచలన కామెంట్స్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.