Vicky Katrina Wedding OTT Platform: బాలీవుడ్ లవ్ బర్డ్స్ విక్కీ కౌశల్ – కత్రినా కైఫ్ అతిత్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నాడు. డిసెంబరు 9న వీరిద్దరి వివాహ వేడుక జరగనుందని టాక్ నడుస్తోంది. రాజస్థాన్‌లోని సిక్స్‌సెన్సెస్‌ ఫోర్ట్‌ భర్వారాలో జరిగే వీరి వివాహానికి హాజరయ్యే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు విచ్చేయనున్నారని తెలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఈ పెళ్లికి వచ్చే అతిథులకు కొన్ని నిబంధనలను పెట్టారట. పెళ్లి లేదా రిసెప్షన్ కు వచ్చే వారెవరూ ఫొటోలు, సెల్ఫీలు తీయడం కానీ.. సోషల్‌మీడియాలో షేర్‌ చేయరాదని ఆంక్షలు పెట్టారు. దీని వెనుక వాణిజ్యపరమైన ఒప్పందాలు ఉన్నాయని బాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది.


ఇదే నిజమైతే కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ పెళ్లికి సంబంధించిన వివాహ వేడుకకు సంబంధించిన ఎలాంటి ఫొటో లేదా వీడియోలు బయటకు రాకపోవచ్చు. ఈ వివాహ వేడుకకు ఫ్యాన్స్ కు అనుమతించడం లేదని తెలుస్తోంది.


వివాహానికి సంబంధించిన వీడియోలను రికార్డు చేసి, వీలు కుదిరితే విక్కీ- క‌త్రినాల‌ను ఇంటర్వ్యూ చేసి, అతిథుల అభిప్రాయాలను కూడా సేకరించి ఆ తర్వాత స్ట్రీమింగ్‌ చేసేందుకు సంప్ర‌దింపులు జ‌రుగుతున్నాయ‌నే టాక్ న‌డుస్తుంది. ఇందుకు ఏకంగా రూ. 100 కోట్లు ఆఫర్‌ చేసినట్లు తెలుస్తోంది. ఇదే నిజ‌మైతే విక్కీ కౌశ‌ల్- క‌త్రినా పెళ్లి రికార్డుల‌కి ఎక్క‌డం ఖాయంగా క‌నిపిస్తుంది.


Also Read: Katrina Kaif Vicky Kaushal wedding : విక్కీ కౌశల్, కత్రినా కైఫ్‌ల పెళ్లికి వచ్చే వాళ్లు తక్కువే.. మొబైల్స్ వద్దన్నారంట


Also Read: RRR Movie Update: ఆర్‌ఆర్‌ఆర్‌ నుంచి మరో సర్‌ప్రైజ్‌..రామ్‌ టీజర్ ను రిలీజ్ చేసిన భీమ్..  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook