Vijay Deverakonda in Kalki 2898 AD: దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో విడుదలైన కల్కి 2898 ఏడి సినిమా.. ఫీవర్ నడుస్తోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం.. కురిపిస్తుంది. భారీ తారాగణంతో తెరకెక్కిన.. ఈ సినిమా లో చాలామంది నటీనటులు క్యామియో పాత్రలలో కూడా కనిపించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

యంగ్ హీరో విజయ్ దేవరకొండ కూడా ఈ సినిమాలో.. మహాభారతం ఎపిసోడ్ లో అర్జునుడి.. పాత్రలో కనిపించారు. తాజాగా విజయ్ దేవరకొండ ఈ సినిమాని.. థియేటర్ లో చూశారు. అయితే విజయ్ దేవరకొండ.. రష్మిక మందన్నతో.. కలిసి ఈ సినిమాని చూశారని టాక్ నడుస్తోంది. ఎప్పటినుంచో వీళ్లిద్దరి.. మధ్య సీక్రెట్ గా ప్రేమ వ్యవహారం.. నడుస్తుంది అని పుకార్లు ఉన్న సంగతి తెలిసిందే. కానీ ఇంకా ఈ విషయంపై..క్లారిటీ మాత్రం రాలేదు. కానీ వీరిద్దరూ చేసే కొన్ని పనులు మాత్రం.. ఇంస్టాగ్రామ్ లో వైరల్ అవుతూ వీరి ప్రేమని రుజువు చేస్తూ ఉంటాయి. ఇక ఇప్పుడు మరోసారి అదే జరిగింది.


దాదాపు ఒకేసారి ఈ ఇద్దరు.. కల్కి సినిమా గురించి సోషల్ మీడియాలో పోస్ట్లు పెట్టడంతో.. వీళ్లిద్దరూ కలిసి సినిమా చూసుంటారు.. అని నెటిజన్లు కనిపెట్టేశారు. 


"ఇప్పుడే సినిమా చూసి వచ్చాను. అసలు నాకు ఏం.. చెప్పాలో కూడా అర్థం కావడం లేదు. ఇండియన్ సినిమాలో ఒక కొత్త లెవెల్ అన్ లాక్ అయింది" అంటూ సోషల్ మీడియాలో సినిమాపై ప్రశంసల వర్షం కురిపించిన.. విజయ్ దేవరకొండ సినిమా 1000 కోట్ల కలెక్షన్లు అందుకోవాలని అన్నారు. మరోవైపు రష్మిక మందన్న కూడా "ఓ మై గాడ్. నాగ్ అశ్విన్.. మీరు ఒక జీనియస్. టీం మొత్తానికి.. నా అభినందనలు. మన మైథాలజికల్ దేవుళ్ళని వెండితెర మీద చూడటం చాలా సంతోషంగా అనిపించింది” అంటూ పోస్ట్ వేసింది.


ఇక సినిమా చూసి బయటికి వచ్చిన.. విజయ్ దేవరకొండ మీడియాతో మాట్లాడుతూ  ఇండియన్ సినిమాని ఎక్కడికో తీసుకెళ్లిపోయాము. అలాంటి సినిమాలో.. నేను కూడా ఒక చిన్న పాత్రలో కనిపించడం నాకు చాలా సంతోషంగా ఉంది అని అన్నారు. కల్కి 2 లో కూడా తన పాత్ర ఉంటుందా అని అడగగా, విజయ్ దేవరకొండ మాత్రం.. నిర్మాత అశ్విని దత్ గారు ఏమంటే అదే కరెక్ట్ అని అన్నారు.


ప్రతి సినిమాలో నాగ్ అశ్విన్.. మిమ్మల్ని తీసుకుంటారు మీరు తనకి లక్కీ చార్మ్ అని అనగా.. విజయ్ దేవరకొండ మాత్రం నాగ్ అశ్విన్ మంచి సినిమాలు తీస్తున్నాడు.. కాబట్టి మాత్రమే హిట్ అవుతున్నాయని, తనేమీ లక్కీ చార్మ్ కాదని అన్నారు.


Also Read: NTR Bharosa Scheme: జగన్‌, చంద్రబాబు అక్కడి నుంచే.. ఆ ఊరికి అంత ప్రత్యేకం ఏమిటి?


Also Read: TDP Toll Free: మీ సమస్య సీఎం చంద్రబాబుకు చెప్పాలా? అయితే ఈ నంబర్‌కు ఫోన్‌ చేయండి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter