Pawan Kalyan: పవన్​ కల్యాణ్​ ఈ పేరు వింటే ఫ్యాన్స్​కు పూనకాలే. పవన్ సినిమా రిలీజ్ అయ్యిందంటే.. థియేటర్ల దగ్గర సందడి మామూలుగా ఉండదు. సినిమాలతో ఎంత మంది ఆయన్ను ఇష్టపడతారో.. నిజ జీవితంలో అంతకన్నా ఎక్కువ మంది ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆయన నటించిన సినిమాలు హిట్టయినా.. కాకపోయినా.. ఫ్యాన్స్​ మాత్రం ఆయనకు బ్రహ్మరథం పడతారు. ఆ మధ్యకాలంలో ఆయనకు వరుసగా ఫ్లాప్​లు పలకరించినా గబ్బర్​ సింగ్ సినిమాతో మళ్లీ ఫ్యాన్స్​లో జోష్​ నింపారు. ఆ తర్వాత అత్తారింటికి దారేది సినిమాతో ఘన విజయం సాధించారు. తాజాగా భీమ్లా నాయక్ సినిమాతో మరోసార్​ బ్లాక్​ బాస్టర్ హిట్​ కొట్టారు.


అయితే పవన్ కల్యాణ్​ సినీ ప్రస్థానం చూస్తే.. స్ట్రెయిట్​ సినిమాలతో పోలిస్తే.. రీమేక్​లతోనే రికార్డులు సృష్టించడం విశేషం. మరి పవన్ కల్యాణ్​ మొత్తం సినిమాల్లో రీమేక్​లు ఎన్నో చూద్దాం.


పవన్ కల్యాణ్​ హీరోగా పరిచయమైన సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. 1996లో ఈ మూవీ వచ్చింది. ఇది హిందీ సినిమా అయిన 'ఖాయ్​మత్​ సే ఖాయ్​మత్​ తక్'.


ఆ తర్వాత వచ్చిన గోకులంలో సీత, సుస్వాగతం వంటి సినిమాలు కూడా రీమేక్​లే కావడం గమనార్హం. అయితే ఇవి రీమేక్​లు అయినా పవన్ కల్యాణ్​ కెరీర్​ బిల్డ్ చేసుకోవడంలో చాలా ఉపయోగపడ్డాయి.


ఇక తమ్ముడు, ఖుషి, అన్నవరం, తీన్మార్​, గబ్బర్​ సింగ్​, కాటమరాయుడు, గోపాల గోపాల, అజ్ఞాతవాసి, వకీల్​ సాబ్​ సహా ఇటీవల రిలీజ్​ అయిన భీమ్లా నాయక్​ మూవీస్​ రీమేక్​లే.


నిజానికి ఖుషి మూవీ స్టోరీ పవన్ కల్యాణ్​ వద్దకే వచ్చింది. అయితే వేరే సినిమాల్లో బిజీగా ఉండటం వల్ల అనుకున్న సమయానికి తెరకెక్కలేదు. దీనితే అదే స్టోరీని డైరక్టర్​ తమిళ్​లో విజయ్​ని హీరోగా పెట్టి తీశారు. అక్కడ ఆ సినిమా విడుదలైన కొన్ని రోజులకే.. తెలుగులో పవన్ కల్యాణ్​ హీరోగా, భూమిక హీరోయిన్​గా ఖుషి తెరకెక్కి సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది. అయితే తొలుత తమిళంలో ఈ సినిమా విడుదలైన కారణంగా టెక్నికల్​గా ఇది రీమేకనే చెబుతున్నారు విశ్లేషకులు.


ఇక పవన్​ కల్యాణ్​ తన అన్నయ్య, మెగా స్టార్ చిరంజీవి సినిమాల్లో గెస్ట్ రోల్స్​ కూడా చేశారు. శంకర్​ దాదా ఎంబీబీఎస్​, శంకర్​ దాదా జిందాబాద్ సినిమాల్లో కొన్ని క్షణాలపాటు కనిపించారు. ఆ రెండు సినిమాలు కూడా రీమేక్​లే కావడం గమనార్హం.


రీమేక్​ కాకుండా రికార్డు స్థాయి కలెక్షన్లతో బ్లాక్​ బాస్టర్​గా నిలిచిన పవన్​ కల్యాణ్​ సినిమా అత్తారింటికి దారేది. ఇక పవన్ కల్యాణ్​ కెరీర్​లో బెస్ట్​ మూవీస్​ గురించి చర్చ వస్తే.. ఖుషీ, తమ్ముడు, బద్రీ వంటి సినిమాలు ఆయనను స్టార్​ హీరోని చేశాయనడంలో సందేహం లేదు.


ఇక ప్రస్తుతానికి వస్తే.. పవన్ కల్యాణ్​ ప్రస్తుతం వినోదయ సీతం, థేరి వంటి సినిమాల రీమేక్​లలో నటించే అవకాశముంది.


Also read: Kareena and Kajol: సుదీర్ఘ కాలం తరువాత కలుసుకున్న కరీనా, కాజోల్, కౌగిలించుకుని, ముద్దులు కూడా


Also read: Bigg Boss Telugu OTT: బిగ్‌బాస్ నాన్‌స్టాప్‌లో ఎలిమినేట్ అయ్యేది మళ్లీ సరయూనేనా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook