Dil Raju Political Entry: వెలమకుచ వెంకట రమణా రెడ్డి.. ఈ పేరు మనలో చాలామందికి తెలియకపోవచ్చు కానీ దిల్ రాజ్ అని చెప్పిన వెంటనే గుర్తుపట్టేస్తారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై 2003లో నిర్మించిన దిల్ చిత్రం తర్వాత అతను దిల్ రాజుగా బాగా పాపులర్ అయ్యాడు. ఇక అప్పటినుంచి టాలీవుడ్ లో అతని పేరు అలాగే స్థిరపడిపోయింది. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అయిన దిల్ రాజ్ త్వరలో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అన్న ఒక వార్త ఫిలింనగర్ లో వైరల్ అవుతుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 త్వరలో జరగబోయే  ఎన్నికల్లో అతను ఎంపీగా పోటీ చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నాడని టాక్. ప్రజల్లో దిల్ రాజ్ కి ప్రొడ్యూసర్ గా మంచి పాపులారిటీ ఉంది. వ్యక్తిగతంగా కూడా అతను అంటే ఇష్టపడే వారు ఎందరో ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రజల అభిమానాన్ని ఈ రకంగా ఎన్కాష్ చేసుకోవడానికి టాలీవుడ్ ప్రొడ్యూసర్ రెడీ అవుతున్నాడు. ఫుల్లు క్యాష్ పార్టీ కాబట్టి దిల్ రాజ్ కు టికెట్ ఇవ్వడానికి కొన్ని రాజకీయ పార్టీలు కూడా ఆసక్తి చూపుతున్నాయట. అంతే కాదు..ఏ పార్టీ నుంచి.. ఏ పార్లమెంట్ స్థానానికి పోటీ చేయాలి అన్న విషయాన్ని త్వరలోనే వెల్లడి కూడా చేస్తారట.


దిల్ రాజ్ స్వస్థలం నిజాంబాద్ కాబట్టి అక్కడ స్థానికుల నుంచి అతనికి మంచి ఆదరణ ఉండే అవకాశం ఉంది. రీసెంట్ గా జరిగిన అతని తమ్ముడి కోడుకు ఆశిష్ వెడ్డింగ్ రిసెప్షన్ కి కూడా సినీ ఇండస్ట్రీ పెద్దలతో పాటు నిజామాబాద్ నుంచి స్థానికులను దిల్ రాజ్ ఆహ్వానించారు. ఈ రిసెప్షన్ వేడుకకు అతని స్వస్థలం తో పాటు నిజామాబాద్ నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో స్థానికులు తరలివచ్చారు. వీటితో పాటుగా స్వస్థలంలో ఆలయ నిర్మాణాల వంటి కార్యక్రమాలను చేపట్టిన దిల్ రాజ్.. ఎంత ఎదిగినా ఇంకా తన ప్రాంతం ప్రజలతో సన్నిహితంగా ఉంటూ వస్తున్నాడు.


ఇక దిల్ రాజు వ్యాపారం విషయానికి వస్తే సినిమాలో తీయడం కంటే కూడా డిస్ట్రిబ్యూటర్ గా దిల్ రాజ్ బాగా లాభాలు గడిస్తున్నాడు. టాలీవుడ్ లో బడా స్టార్ హీరోల సినిమాలు ఏవైనా సరే దిల్ రాజ్ చేతికి వెళ్లాల్సిందే అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఈ నేపథ్యంలో దిల్ రాజు పొలిటికల్ ఎంట్రీ హాట్ టాపిక్ గా మారింది.


Also Read: Kuppam: చంద్రబాబును ఓడించండి.. కుప్పం అభివృద్ధి చేసుకుందాం: సీఎం జగన్‌ పిలుపు


Also Read: Floating Bridge: లేదు లేదు 'తేలియాడే వంతెన' కొట్టుకుపోలే.. మేమే దాన్ని విడదీశాం


 



 


 


 


 


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి