Dil Raju: రేవంత్ రెడ్డి దగ్గరికి దిల్ రాజు.. ఆశిష్ పెళ్లికార్డ్ అందజేసిన ఫ్యామిలీ
Asish Marriage: రౌడీ బాయ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన దిల్ రాజు ఫ్యామిలీ కాంపౌండ్ హీరో ఆశిష్. మొదటి సినిమా కాగానే ఈ హీరో పెళ్లికి సిద్ధమైపోయారు…ప్రస్తుతం ఈ హీరో పెళ్లి కార్డులు పంచే పనిలో పడ్డారు నిర్మాత దిల్ రాజు
Dil Raju Invited Revanth Reddy: నిర్మాత దిల్ రాజు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. తెలుగు ఇండస్ట్రీలో అత్యంత పేరు తెచ్చుకున్న నిర్మాతల్లో ఈయన ఒకరు. దిల్ రాజు సోదరుడు శిరీష్ కూడా నిర్మాణ రంగంలో దిల్ రాజుతో కలిసి పనిచేస్తుంటారు అనే విషయం తెలిసిందే. శిరీష్ తనయుడు ఆశిష్ రౌడీ బాయ్స్ అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. త్వరలోనే సెల్ఫిష్ అనే మరో సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. ఇప్పటికే ఇంకో సినిమా కూడా సైన్ చేశారు ఈ హీరో. అయితే ఆ చిత్రాల విడుదలకు ముందే ఈ యువ హీరో ఇప్పుడు పెళ్లిపీటలు ఎక్కుతున్నాడు.
గత ఏడాది నవంబర్ లో అద్విత రెడ్డి అనే అమ్మాయితో ఆశిష్ నిశ్చితార్థం జరిగింది. ఎంగేజ్మెంట్ కేవలం రెండు కుటుంబాల మధ్యే జరిగింది. ఆ కార్యక్రమానికి సెలబ్రిటీస్ ప్రముఖులు ఎవరు అటెండ్ అవ్వలేదు. అయితే పెళ్లి మాత్రం గ్రాండ్ గా జరపడానికి సిద్ధమైపోయారు దిల్ రాజు ఫ్యామిలీ. ఇటీవలే దిల్ రాజు, ఫ్యామిలీ కలిసి ఆశిష్ పెళ్ళికి పలువురు సినీ ప్రముఖులను స్వయంగా కలిసి పెళ్లి కార్డు ఇచ్చి ఆహ్వానించారు.
ఆశిష్ – అద్విత రెడ్డి పెళ్లి ఘనంగా ఫిబ్రవరి 14న వాలెంటైన్ డే రోజు జైపూర్ లోని ఓ రాజమహల్ లో జరగనుంది. తాజాగా ఈ పెళ్లికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా ఆహ్వానించారు దిల్ రాజు. దిల్ రాజు తో పాటు శిరీష్ అలానే ఆశిష్ రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి మరి పెళ్లి కార్డు అందజేశారు. రేవంత్ రెడ్డి తప్పకుండా వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరారు. ప్రస్తుతం దిల్ రాజు, ఆశిష్, శిరీష్ వెళ్లి రేవంత్ రెడ్డికి ఆహ్వాన పత్రిక ఇచ్చిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
అయితే వివాహం తర్వాత హైదరాబాద్ లో ఫిబ్రవరి 23న గ్రాండ్ గా వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు. అందుకే పెళ్లికి ఎంతమంది వెళతారో తెలియదు కానీ ఆ తర్వాత ఇచ్చే రిసెప్షన్ కి మాత్రం టాలీవుడ్ అంతా తరలి రానుంది అని తెలుస్తోంది.
Also read: Seerath Kapoor: హీట్ పుట్టిస్తోన్న సీరత్ కపూర్ లేటెస్ట్ ఫోటో షూట్.. పిక్స్ వైరల్..
Also read: White Hair Problem: తెల్ల వెంట్రుకలు నల్ల బడేందుకు అద్భుతమైన చిట్కా, ఆ రెండు వస్తువులు కలిపితే చాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook