Ashish Selfish Movie : సినీ ఇండస్ట్రీలోకి అందరికీ అంత ఈజీగా ప్రవేశం లభించదు. వారసులుగా వచ్చే వారికి ఎంట్రీ కాస్త సులభంగా మారుతుంది. కొన్ని అవకాశాలు గుమ్మం ముందుకే వస్తాయి. కానీ కష్టపడటం మాత్రం కామన్‌గానే ఉంటుంది ఎవరికైనా. ఇక మరీ ముఖ్యంగా జనాల నుంచి హీరోగానో, నటుడిగానో పర్వాలేదనిపించేలా యాక్సెప్టెన్సీ మాత్రం రావాలి. ప్రేక్షకులు హీరోగా గుర్తించకపోతే ఏ వారసత్వం కూడా సదరు నటుడ్ని కాపాడలేదు. హీరోగానో, నటుడిగానో, కమెడియన్‌గానో, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానో ఇలా ఏదో ఒక కేటగిరీలో జనాలు అంగీకరించాల్సి ఉంటుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గత ఏడాది ఇద్దరు హీరోలు కొత్తగా పరిచయం అయ్యారు. మహేష్‌ బాబు మేనల్లుడిగా గల్లా ఫ్యామిలీ నుంచి ఒకతను వచ్చాడు. ఇక దిల్ రాజు అన్న కొడుకు అంటూ ఆశిష్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ ఇద్దరూ కూడా సంక్రాంతి బరిలోకి దిగారు. వీరిద్దరూ నటించిన రెండు చిత్రాలు కూడా బోల్తా పడ్డాయి. గల్లా అశోక్ హీరో, ఆశిష్‌ రౌడీ బాయ్స్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లుగా నిలిచాయి. కనీసం నటులుగానైనా జనాలు గుర్తించలేదనిపిస్తోంది.


ఇప్పుడు గల్లా రెండో సినిమా గురించి అంతగా అప్డేట్ అయితే రాలేదు. కానీ దిల్ రాజు క్యాంప్ మాత్రం ఫుల్ బిజీగా ఉంటోంది. తమ వారసుడ్ని నిలబెట్టేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇప్పుడు ఆశిష్ రెండో సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. ఆశిష్ రెండో ప్రయత్నంగా సెల్ఫీష్ అనే సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమాకు సుకుమార్ రైటింగ్స్ కూడా పని చేస్తోంది.


 



సుకుమార్ బ్రాండ్‌తో సినిమాను అమ్మేసుకుందామని చూసుకుంటున్నారా? అని జనాలు కౌంటర్లు వేస్తున్నారు. కానీ దిల్ రాజుకు మాత్రం తమ వారసుడిని నిలబెట్టడమే ధ్యేయంగా కనిపిస్తోంది. మరి ఆశిష్‌ రెండో ప్రయత్నం సెల్ఫీష్ సినిమా ఎలా ఉంటుందో చూడాలి. ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయిందనే అప్డేట్ అయితే ఇచ్చారు. మరి ఈ చిత్రం థియేటర్లోకి ఎప్పుడు వస్తుందో చూడాలి.


Also Read : Anasuya Bharadwaj : తాగుతారా? అంటూ నెటిజన్ ప్రశ్న.. చేతిలో ఒక్క షో లేకపోవడానికి కారణం చెప్పిన అనసూయ


Also Read : Bigg Boss Shiva Jyothi : కొత్త ఇంట్లోకి అడుగు పెట్టిన శివ జ్యోతి.. బిగ్ బాస్ కంటెస్టెంట్ల సందడి


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook